Teegala Krishna Reddy | హైదరాబాద్ : హైదరాబాద్ నగర మాజీ మేయర్ తీగల కృష్ణారెడ్డి మళ్లీ సొంతగూటికి చేరుకోనున్నారు. తెలుగు దేశం పార్టీలో చేరేందుకు తీగల సిద్ధమయ్యారు. ఈ మేరకు హైదరాబాద్లో ఏపీ సీఎం చంద్రబాబుతో తీగల కృష్ణారెడ్డి భేటీ అయ్యారు.
చంద్రబాబుతో భేటీ అనంతరం తీగల కృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం చంద్రబాబు ఏపీకి ముఖ్యమంత్రి కావడం మాకు సంతోషాన్ని ఇచ్చింది. మళ్లీ ఎన్టీ రామారావు పాలన రావాలి. హైదరాబాద్ నగరం చంద్రబాబు వల్లే అభివృద్ధి చెందింది. సైబరాబాద్ సిటీని తీసుకొచ్చింది చంద్రబాబే అని తెలిపారు. నన్ను మేయర్గా చేశారు. తెలంగాణలో టీడీపీకి పూర్వ వైభవం తీసుకొస్తాం. చాలా మంది తెలుగు దేశం అభిమానులు ఉన్నారు. అందరిని ఏకతాటిపైకి తీసుకొస్తాను. త్వరలోనే చంద్రబాబు మళ్లీ కలుద్దామని చెప్పారని తీగల కృష్ణారెడ్డి పేర్కొన్నారు. తీగల కృష్ణారెడ్డి వెంట మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డి, అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి కూడా ఉన్నారు. వీరిద్దరూ కూడా చంద్రబాబును కలిశారు. అయితే తన మనువరాలి పెళ్లి ఆహ్వాన పత్రిక ఇచ్చేందుకు చంద్రబాబును కలిశానని మల్లారెడ్డి తెలిపారు.
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడును కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మల్లారెడ్డి, మర్రి రాజశేఖర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి
నేను టీడీపీలో చేరుతాను.. మళ్లీ అందరం కలిసి టీడీపీకి పూర్వ వైభవం తెస్తాం.
చంద్రబాబు నాయుడు వల్ల హైదరాబాద్ అభివృద్ధి చెందింది.
తెలంగాణలో ఇంకా టీడీపీ… pic.twitter.com/9YQ7Je7o0z
— Telugu Scribe (@TeluguScribe) October 7, 2024
ఇవి కూడా చదవండి..