KTR | హైదరాబాద్ : రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి పది నెలలు అవుతున్నా.. ఒక్క సంక్షేమ, అభివృద్ధి పథకం అమలుకు నోచుకోలేదు. రేవంత్ రెడ్డి పరిపాలన ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా తయారైంది. ఏ ఒక్క వర్గానికి కూడా ఇప్పటి వరకు ఒక్క సంక్షేమ పథకం అందలేదు. ఈ క్రమంలో రేవంత్ సర్కార్‌పై రాష్ట్ర ప్రజానీకం తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.
ఈ పరిస్థితుల నేపథ్యంలో రేవంత్ సర్కార్ పరిపాలనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు. మింగ మెతుకు లేదు.. కానీ మీసాలకు మాత్రం సంపెంగ నూనె కావాలె అన్నట్టునది రేవంత్ వైఖరి అని కేటీఆర్ విమర్శించారు. తెల్లారి లేస్తే బీద అరుపులు. రాష్ట్రం అప్పులపాలైంది అని, డబ్బులు లేవని. మరొకవైపు మూసీ పేరిట ఈ లక్ష యాభై వేల కోట్ల సోకులు, ఆర్భాటం ఎవరికోసం? అని కేటీఆర్ ప్రశ్నించారు. ఈ సందర్భంగా రేవంత్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కేటీఆర్ మరోసారి గుర్తు చేశారు.
మింగ మెతుకు లేదు కానీ, మీసాలకు మాత్రం సంపెంగ నూనె కావాలె అన్నట్టునది రేవంత్ వైఖరి
తెల్లారి లేస్తే బీద అరుపులు. రాష్ట్రం అప్పులపాలైంది అని, డబ్బులు లేవని.
మరొకవైపు మూసి పేరిట ఈ లక్ష యాభై వేల కోట్ల సోకులు, ఆర్భాటం ఎవరికోసం?
❌ రైతు రుణమాఫీకి డబ్బులు లేవు
❌ రైతుబంధుకి…— KTR (@KTRBRS) October 7, 2024
ఇవి కూడా చదవండి..
Deputy CM Bhatti | సింగరేణి కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది : డిప్యూటీ సీఎం భట్టి
HYDRAA Vs GHMC | హైడ్రా కమిషనర్.. ఆమ్రపాలి మధ్య ఆధిపత్య పోరు