హైదరాబాద్ : సింగరేణి తెలంగాణ రాష్ట్రానికే తలమానికమైన సంస్థ. సింగరేణిపై ఆధారపడి ఎన్నో వేల కుటుంబాలు జీవిస్తున్నాయి. సింగరేణి కార్మికుల(Singareni workers) సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Deputy CM Bhatti) పేర్కొన్నారు. సోమవారం ప్రజాభవన్‌లో(Praja Bhavan) సింగరేణి కార్మికులకు దసరా బోనస్ చెక్కుల(Dussehra bonus) పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ.. 2023-24 ఏడాదిలో సింగరేణి లాభం రూ.4,701 కోట్లు నమోదయ్యింది.
సింగరేణి కార్మికులకు సంతోషంగా బోనస్ ప్రకటిస్తున్నాన్నారు. సింగరేణి కార్మికులకు రూ.796 కోట్లు బోనస్‌గా ప్రకటించాం. ఒక్కో కార్మికుడికి సగటున రూ.1.90 లక్షలు బోనస్ వస్తుంది. సింగరేణిలో శాశ్వత ఉద్యోగులు 41,837. సింగరేణిలో ఒప్పంద ఉద్యోగులకు కూడా బోనస్ ఇవ్వాలని నిర్ణయించినట్లు ఆయన పేర్కొన్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం తరఫున సింగరేణి కార్మికులకు అవసరమైన అన్ని సదుపాయాలను ఏర్పాటుచేస్తామని ఆయన తెలిపారు.