శనివారం 15 ఆగస్టు 2020
Telangana - Jul 28, 2020 , 23:13:28

నాడు ఆంధ్రకేసరికి శతజయంతి.. నేడు పీవీకి..

నాడు ఆంధ్రకేసరికి శతజయంతి.. నేడు పీవీకి..

ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం శతజయంతి వేడుకలను నిర్వహించాలని ఆనాటి ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఆ సమయంలో ముఖ్యమంత్రి హోదాలో ఉన్న పీవీ అధ్యక్షతన ఉత్సవసంఘం ఏర్పాటైంది. ప్రకాశం పంతులుకు అత్యంత సన్నిహితంగా ఉన్న తెన్నేటి విశ్వనాథం వంటి వారితో కమిటీని రూపొందించారు. ఆయన శతజయంతి సందర్భంగా జైళ్లలో ఖైదీలకు క్షమాభిక్ష కూడా ప్రసాదించారు. గాంధీ శతజయంతి వేడుకల్లోనూ పీవీ భాగస్వామి అయ్యారు. అలా ఇద్దరు గొప్ప వ్యక్తుల శతజయంతులను జరిపించిన పీవీకి.. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం శతజయంతిని ఘనంగా నిర్వహిస్తుండటం విశేషం.logo