KTR | హైదరాబాద్ : కల్వకుర్తి సూర్యలత స్పిన్నింగ్ మిల్ అధ్యక్షుడిగా మూడోసారి గెలిచిన ఐనేని సూర్యప్రకాశరావును బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సన్మానించారు. ఈ సందర్భంగా సూర్యప్రకాశ్ రావుకు కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపి అభినందించారు. కేటీఆర్‌కు సూర్యప్రకాశ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
కల్వకుర్తి మండలం మార్చాల సత్యసాయినగర్ సూర్యలత స్పిన్నింగ్ మిల్లులో ఇటీవల జరిగిన కార్మిక సంఘం ఎన్నికల్లో బీఆర్ఎస్కేవీ బలపరిచిన అభ్యర్థి సూర్యప్రకాశ్‌రావు అధ్యక్షుడిగా ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. సూర్యలత కాటన్ మిల్లులో కార్మిక సంఘం ఎన్నికల్లో బీఆర్ఎస్కేవీ బలపరిచిన అభ్యర్థిగా సూర్యప్రకాశ్‌రావు, ఐఎన్టీయూసీ(కాంగ్రెస్) అభ్యర్థిగా మాజీ సర్పంచ్ ఆనంద్‌కుమార్ పోటీ చేశారు.
మంగళవారం కార్మికశాఖ డిప్యూటీ కమిషనర్ ఆధ్వర్యంలో ఉదయం 7 నుంచి మధ్యా హ్నం 2 గంటల వరకు జరిగిన ఎన్నికల్లో మొత్తం 450ఓట్లకు గానూ 438 ఓట్లు పోలవ్వగా అందులో 251 ఓట్లు సూర్యప్రకాశ్‌రావుకు, 183 ఓట్లు ఆనంద్‌కుమార్‌కు పోలవ్వగా, 4 ఓట్లు చెల్లని ఓట్లుగా నమోదు కాగా 68 ఓట్ల మెజార్టీతో సూర్యప్రకాశ్‌రావు విజయం సాధించారు. సూర్యప్రకాశ్‌రావు విజయం సాధించడంతో అభిమానులు, కార్మికులు పెద్దఎత్తున సంబురాలు జరుపుకొన్నారు.
ఇవి కూడా చదవండి..
Nagarjuna Akkineni | నాగార్జునపై క్రిమినల్ కేసు నమోదు.. రేవంత్ సర్కార్ కక్ష సాధింపు చర్యలు
KTR | మూసీ వెనక దాక్కున్న ముసుగు దొంగ ఎవరు..? కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన కేటీఆర్
KTR | తెలంగాణ అస్తిత్వ సంబురంపై ఎందుకింత నిర్లక్ష్యం..: కేటీఆర్