మెట్పల్లి, జనవరి 19: మార్టిగేజ్ డీడ్ రిజిస్ట్రేషన్ కోసం లంచం తీసుకుంటూ ఏసీబీ(ACB) అధికారులకు పట్టుబడిన జగిత్యాల జిల్లా మెట్పల్లి సబ్ రిజిస్ట్రార్(Sub-Registrar) అసిఫొద్ధీన్ను సస్పెండ్ చేస్తూ రిజిస్ట్రేషన్ల శాఖ డీఐజీ ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన స్థానంలో అదే కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ బాల్సింగ్కు సబ్ రిజిస్ట్రార్‌గా ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు. కాగా, ఐడీ లాక్ చేయడంతో శుక్రవారం మధ్యాహ్నం నుంచి రిజిస్ట్రేషన్ల ప్రక్రియ నిలిచిపోయింది.
ఈ క్రమంలో జూనియర్ అసిస్టెంట్‌కు బదులుగా ఆ శాఖ కరీంనగర్ డీఐజీ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్న విజయ్ భాస్కర్‌ను ఇన్చార్జి సబ్ రిజిస్ట్రార్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీచేశారు. సోమవారం ఆయన విధుల్లో చేరనుండగా, రెండు రోజులుగా నిలిచిపోయిన రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కొత్త ఐడీ అప్డేట్తో తిరిగి కొనసాగనుంది.
ఇవి కూడా చదవండి..