KTR | కాంగ్రెస్ ద్వంద్వ ప్రమాణాలకు ఢిల్లీలో ఆ పార్టీ అనుసరిస్తున్న వైఖరే సజీవసాక్ష్యమని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. అవసరం ఉన్నప్పుడు ఒకలా, అవసరం తీరిపోయాక మరోలా వ్యవహరించడం కాంగ్రెస్ పార్టీకి వెన్నతో పెట్టిన విద్య అని విమర్శించారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆప్ అధినేత అర్వింద్ కేజ్రీవాల్ పట్ల ప్రదర్శిస్తున్న వైఖరికి, పార్లమెంటు ఎన్నికల సమయంలో ఇండియా కూటమిలో ఉన్న అదే కేజ్రీవాల్ పట్ల కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న వైఖరిని పరిశీలిస్తే అది తెలుస్తుందని తెలిపారు.
నిన్నటిదాకా సత్యసంధుడు, వివేకవంతుడు, నీతిమంతుడిగా కనిపించిన కేజ్రీవాల్లో ఉన్నపళంగా నేడు అవినీతిపరుడిగా, చెత్తనాయకుడిగా కనిపిస్తున్నారని కేటీఆర్ విమర్శించారు. రాజకీయాల్లో ద్వంద్వ ప్రమాణాలు పాటించే విషయంలో కాంగ్రెస్ పార్టీ ఒక పాఠ్యపుస్తకమని ఆయన ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ తమకు ఇచ్చిన హామీలు అమలు కోసం ఏడాది కాలంగా తెలంగాణలోని విద్యార్థులు, రైతులు, వృద్ధులు, మహిళలు ఏడాదికాలంగా నిరీక్షిస్తున్నారని తెలిపారు. ఇప్పుడు ఢిల్లీలో కూడా కాంగ్రెస్ పార్టీ అవే తరహాలో హామీలను ప్రజలకు ఇస్తుందని మండిపడ్డారు. ఢిల్లీ ఓటర్లను మోసం చేయడానికి ముందు తెలంగాణలోని అన్ని వర్గాల ప్రజలతో మాట్లాడి, వారి అనుభవాలను తెలుసుకోవాలని సూచించారు.
Delhi assembly elections are a perfect case study of Congress’s dual standards and hypocritical antics. As long as @ArvindKejriwal Ji was aligned with them, he was hailed as a sane and clean leader, and Delhi looked spectacular through the alliance-tinted glasses. The moment…
— KTR (@KTRBRS) January 19, 2025