Urvashi Rautela – Game Changer | బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా మళ్లీ తన నోటికి పని చెప్పింది. ఇప్పటికే క్రికెటర్ రిషబ్ పంత్(Rishab Pant)తో పాటు సైఫ్ అలీఖాన్ (Saif Ali Khan)పై సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచిన ఈ భామ తాజాగా.. తన నోటి దూలతో గేమ్ ఛేంజర్ సినిమాపై సంచలన వ్యాఖ్యలు చేసి మరోసారి వార్తల్లో నిలిచింది. రామ్ చరణ్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం గేమ్ ఛేంజర్. శంకర్ ఈ సినిమాకు దర్శకత్వం వహించగా.. అగ్ర నిర్మాత దిల్ రాజు భారీ బడ్జెట్తో నిర్మించాడు. సంక్రాంతి కానుకగా జనవరి 10న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మిక్స్డ్ టాక్ తెచ్చుకున్న విషయం తెలిసిందే. శంకర్ మ్యాజిక్ ఈ సినిమాకి పనిచేయక పోగా.. అదే పాత రోడ్డ కొట్టుడు కమర్శియల్ సినిమా అని నెటిజన్లు కామెంట్లు చేశారు.
ఇదిలావుంటే తాజాగా ఈ సినిమాను డిజాస్టర్ అంటూ నోరు జారింది నటి ఊర్వశి రౌతేలా. బాలకృష్ణ డాకు మహరాజ్తో ఇటీవల హిట్టు అందుకున్న ఈ అమ్మడు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. కియారా అద్వానీ నటించిన గేమ్ ఛేంజర్ డిజాస్టర్ అయ్యిందని.. నేను నటించిన డాకు మహరాజ్ సినిమా సూపర్ హిట్ అయ్యిందని.. ఇందులో నా తప్పులేదని.. అలాగే సినిమా బాగా లేకున్న పెయిడ్ పీఆర్లు చేసిన జనాలు తిప్పికోడతారని ఊర్వశి చెప్పుకోచ్చింది. కాగా ఇందుకు సంబంధించిన వీడియో వైరల్గా మారింది.
Kiara’s #GameChanger is a disaster and my film #DaakuMaharaaj is a blockbuster.
– @UrvashiRautela pic.twitter.com/ieKUHB9UIP— Telugu Chitraalu (@TeluguChitraalu) January 19, 2025