శనివారం 28 నవంబర్ 2020
Telangana - Nov 13, 2020 , 06:44:47

స్టాఫ్‌న‌ర్స్ స‌ర్టిఫికెట్ వెరిఫికేషన్‌ వాయిదా

స్టాఫ్‌న‌ర్స్ స‌ర్టిఫికెట్ వెరిఫికేషన్‌ వాయిదా

హైద‌రాబాద్‌: నేటి నుంచి జ‌ర‌గాల్సిన స్టాఫ్‌న‌ర్స్ అభ్య‌ర్థుల ధ్రువ‌ప‌త్రాల ప‌రిశీల‌న వాయిదాప‌డింది. వెయిటేజీ వివాదం త‌లెత్త‌డంతో ఆన్‌లైన్‌ సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్టు టీఎస్‌పీఎస్సీ ప్రకటించింది. సర్వీస్‌ ప్రొవైడర్‌ సాంకేతిక కారణాల వల్ల ఈ ప్రక్రియను నిలిపివేస్తున్నట్టు పేర్కొన్నది. షెడ్యూల్ ప్ర‌కారం నేటి నుంచి ఈ నెల 19 వరకు వెరిఫికేష‌న్ జరుగాల్సి ఉంది. కాగా, కొత్త తేదీలను త్వరలో వెల్లడిస్తామని తెలిపింది. స్టాఫ్‌న‌ర్స్ అభ్య‌ర్థుల విన‌తిప‌త్రాల‌ను వైద్య ఆరోగ్య‌శాఖ‌కు పంపించామ‌ని, శాఖ నివేదిక త‌ర్వాత అవ‌స‌ర‌మైతే మెరిట్ జాబితాను మారుస్తామ‌ని వెల్ల‌డించింది.

స్టాఫ్‌ నర్స్‌ పోస్టులకు 1: 2 ప్రాతిపదికన ఎంపిక చేసిన అభ్యర్థులకు సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ నిర్వహిస్తున్నట్లు ఈనెల 8న‌ ప్రకటించింది. అయితే వెయిటేజీ మార్కులు ఇచ్చే విషయంలో తప్పులు దొర్లినట్టు ఫిర్యాదులు వచ్చినట్టు తెలిపింది. మొత్తం 3,311 పోస్టులకు 26,412 మంది దరఖాస్తు చేసుకున్నారు. వారిలో పరీక్షలకు హాజరైన 21,391 మందితో కూడిన మెరిట్‌ జాబితాను టీఎస్‌పీఎస్సీ ప్రకటించింది.