SCR | హైదరాబాద్ : సంక్రాంతి పండుగ రద్దీ దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే అదనపు రైళ్లను నడిపించేందుకు చర్యలు చేపట్టింది. 26 అదనపు రైళ్లను నడుపుతున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. ఈ నెల 17వ తేదీ వరకు ఈ అదనపు రైళ్లు అందుబాటులో ఉండనున్నాయి. చర్లపల్లి నుంచి విశాఖకు, సికింద్రాబాద్ – బెంగళూరు మధ్య అదనపు రైళ్లను నడపనున్నారు.
ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లే ప్రయాణికులను దృష్టిలో ఉంచుకుని చర్లపల్లి – విశాఖ మధ్య జనసాధారణ్ అన్‌రిజర్వుడ్ రైళ్లను నడుపుతోంది. చర్లపల్లి నుంచి విశాఖకు ఈ నెల 11, 13, 16, 18, 20, 25 తేదీల్లో రైళ్లు అందుబాటులో ఉండనున్నాయి. చర్లపల్లిలో ఉదయం 10 గంటలకు బయల్దేరి విశాఖకు రాత్రి 10 గంటలకు చేరుకోనున్నాయి. విశాఖ నుంచి చర్లపల్లికి ఈ నెల 10, 12, 15, 17, 20, 25 తేదీల్లో రైళ్లు నడవనున్నాయి. విశాఖ నుంచి సాయంత్రం 6.20కి బయల్దేరి ఉదయం 8 గంటలకు చర్లపల్లికి చేరుకోనున్నాయి.
ఇవి కూడా చదవండి..
Traffic | హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ
TG Highcourt | రైతుల హక్కులను కాలరాయొద్దు.. శాంతియుత ఆందోళనలో పోలీసుల ప్రమేయం ఎందుకు?
MLA Jagadish Reddy | రేవంత్‌పై బండికి ఎందుకంత ప్రేమ? సీఎంకు ఏజెంట్లుగా బీజేపీ నాయకులు