Abhishek Sharma: పాక్‌తో మ్యాచ్‌లో అభిషేక్ ఆడే అవకాశం ఉంది : వరుణ్ చక్రవర్తి
Abhishek Sharma: ఆదివారం పాకిస్థాన్‌తో జరిగే మ్యాచ్‌లో అభిషేక్ శర్మ ఆడే అవకాశాలు ఉన్నట్లు భారత స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి తెలిపాడు. కడుపు ఇన్ఫెక్షన్తో బాధపడుతున్న అభిషేక్.. గురువారం నమీబియాతో జరిగిన మ్యాచ్‌లో ఆడని విషయం తెలిసిందే.
న్యూఢిల్లీ: టీ20 వరల్డ్‌కప్‌లో ఆదివారం పాకిస్థాన్‌తో జరిగే మ్యాచ్‌లో అభిషేక్ శర్మ(Abhishek Sharma) ఆడే అవకాశాలు ఉన్నట్లు భారత స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి తెలిపాడు. కడుపు ఇన్ఫెక్షన్తో బాధపడుతున్న అభిషేక్.. గురువారం నమీబియాతో జరిగిన మ్యాచ్‌లో ఆడని విషయం తెలిసిందే. అయితే అభిషేక్ శర్మ ఆరోగ్యం ప్రస్తుతం బాగానే ఉన్నట్లు వరుణ్ చెప్పాడు. ఆరోగ్యం క్షీణించడం వల్ల రెండు రోజుల పాటు అభిషేక్ ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నాడు. అభిషేక్‌తో మాట్లాడానని, అతను బాగానే ఉన్నాడని, ఇవాళ కొంత ప్రాక్టీస్ చేశాడని, సిద్ధం అవుతున్నట్లు అతను చెప్పాడని వరుణ్ చక్రవర్తి పేర్కొన్నాడు.
నమీబియాతో జరిగిన మ్యాచ్‌లో వరుణ్ చక్రవర్తి రెండు ఓవర్లు వేసి 7 పరుగులిచ్చి మూడు వికెట్లు తీసుకున్నాడు. ఆ మ్యాచ్ టాస్ వేసిన సమయంలో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ.. ఒకటి లేదా రెండు మ్యాచ్‌లు అభిషేక్ శర్మ మిస్సయ్యే అవకాశాలు ఉన్నట్లు పేర్కొన్న విషయం తెలిసిందే. అభిషేక్ శర్మ గైర్హాజరీలో నమీబియాతో మ్యాచ్‌లో సంజూ శాంసన్ ఓపెనింగ్ బాధ్యతలు చేపట్టాడు.
వరల్డ్‌కప్‌లో ఇండియా వరుసగా తన రెండో మ్యాచ్ నెగ్గింది. నమీబియాపై 93 రన్స్ తేడాతో నెగ్గింది. ఒకవేళ కొలంబోలో జరిగే ప్రాక్టీస్ సెషన్లో అభిషేక్ పాల్గొంటే అతను పాక్‌తో మ్యాచ్‌కు ఆడేది లేనిది తేలే అవకాశం ఉంటుంది. నెట్స్‌లో చాలా సమయం అతను బ్యాటింగ్ ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. దాని ఆధారంగా ఇండోపాక్ మ్యాచ్‌పై క్లారిటీ వస్తుంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fire accident | కూకట్‌పల్లిలో భారీ అగ్నిప్రమాదం.. షార్ట్ సర్క్యూటే కారణమా?
Horoscope | 09-11-2026 సోమవారం.. మీ రాశి ఫలాలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

