సంగారెడ్డి : సంగారెడ్డి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. నవమాసాలు మోసి కని పెంచిన తల్లిని కనికరం లేకుండా హతమార్చాడో(Son stabs mother)దుర్మార్గుడు. ఆస్తి కోసం పాలిచ్చి పెంచి ప్రయోజకుడిని చేసిన కన్నతల్లినే కర్కశంగా కత్తితో పొడిచి చంపాడు. వివరాల్లోకి వెళ్తే..తెల్లాపూర్ దివినో విల్లాస్లో నివాసముం టున్న రాధిక (52) ను ఆమె కొడుకు కార్తీక్ రెడ్డి ఉదయం ఆస్తి కోసం తల్లితో గొడవ పడ్డాడు. తల్లిపై కత్తితో దాడి చేసి ఎనిమిదిసార్లు పొడిచాడు.
గమనించిన స్థానికులు రాధికను హుటాహుటిన హాస్పిటల్కు తరలించారు. చికిత్స పొందుతూ రాధిక మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కార్తిక్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. కాగా, నిందితుడు మత్తు పదార్థాలు సేవిస్తూ, మద్యానికి బానిసైనట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
ATM Robbery | రావిర్యాల ఎస్బీఐ ఏటీఎం చోరీ పాత నేరస్థుల పనే?.. కొనసాగుతున్న దర్యాప్తు
Metabolism | భోజనం చేసిన తరువాత వీటిని తీసుకోండి.. శరీర మెటబాలిజం పెరిగి కొవ్వు కరుగుతుంది..!