Metabolism | భోజనం చేసిన తరువాత జీర్ణాశయం తన పనిని ప్రారంభిస్తుంది. మనం తిన్న ఆహారాన్ని జీర్ణం చేస్తుంది. అందులో ఉండే పోషకాలను శరీరం శోషించుకునేందుకు లివర్ తన పనిని మొదలుపెడుతుంది. అయితే మెటబాలిజం సరిగ్గా ఉంటే ఈ పనులన్నీ యథావిధిగా జరిగిపోతాయి. కానీ మెటబాలిజం సరిగ్గా లేని వారు లేదా థైరాయిడ్ వంటి వ్యాధులతో బాధపడుతున్నవారికి ఆహారాన్ని జీర్ణం చేసుకోవడం ఆలస్యం అవుతుంది. దీంతో తిన్న ఆహారం కొవ్వుగా మారి శరీరంలో నిల్వ ఉంటుంది. ఇది అధిక బరువుకు దారి తీస్తుంది. కనుక ఈ సమస్య రాకుండా ఉండాలంటే మన శరీర మెటబాలిజం సక్రమంగా ఉండాలి. అప్పుడే జీర్ణ వ్యవస్థ, లివర్ సరిగ్గా పనిచేస్తాయి. అయితే మన శరీర మెటబాలిజం సక్రమంగా ఉండేందుకు గాను భోజనం చేసిన తరువాత పలు ఆహారాలను తీసుకోవాల్సి ఉంటుంది. ఇంతకీ ఆ ఆహారాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
భోజనం చేసిన తరువాత గుప్పెడు సోంపు గింజలను తీసుకుని నమలాలి. దీని వల్ల జీర్ణాశయంలో పలు ఎంజైమ్‌ల ఉత్పత్తి పెరుగుతుంది. దీని వల్ల మనం తిన్న ఆహారం సులభంగా జీర్ణమవుతుంది. మనం తిన్న ఆహారంలో ఉండే పోషకాలను శరీరం శోషించుకుంటుంది. అలాగే శరీర మెటబాలిజం కూడా పెరుగుతుంది. దీంతో క్యాలరీలు ఖర్చవుతాయి. కొవ్వు కరుగుతుంది. అధిక బరువు తగ్గుతారు. అయితే సోంపు గింజలతోపాటు జీలకర్ర కూడా కలిపి తినవచ్చు. బరువును తగ్గించడంలో, శరీర మెటబాలిజంను పెంచడంలో జీలకర్ర అద్భుతంగా పనిచేస్తుంది. ఇది జీర్ణ సమస్యలను సైతం తగ్గిస్తుంది. కడుపు ఉబ్బరం, గ్యాస్, అసిడిటీ, మలబద్దకం వంటి సమస్యలు ఉన్నవారు భోజనం చేసిన అనంతరం జీలకర్రను తింటుంటే ఫలితం ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. అయితే జీలకర్రను నేరుగా తినడం ఇష్టం లేకపోతే దాంతో నీళ్లను తయారు చేసి తాగవచ్చు. ఇలా చేసినా కూడా మనకు లాభాలే కలుగుతాయి.
భోజనం చేసిన అనంతరం తీసుకోదగిన ఆహారాల్లో వాము కూడా ఒకటి. వామును మనం తరచూ వంటల్లో వేస్తుంటాం. కానీ దీన్ని నేరుగా తింటేనే ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. ఇది ఘాటుగా ఉంటుంది కనుక నేరుగా తినలేని వారు నీళ్లను తయారు చేసి తాగవచ్చు. వామును తినడం వల్ల జీర్ణక్రియ మెరుగు పడుతుంది. మెటబాలిజం పెరుగుతుంది. దీని వల్ల కడుపు ఉబ్బరం, అజీర్తి, త్రేన్పులు వంటి సమస్యల నుంచి బయట పడవచ్చు. వామును తింటే పలు జీర్ణాశయ ఎంజైమ్‌లు ఉత్పత్తి అవుతాయి. ఇవి జీర్ణక్రియను పెంచుతాయి. దీంతో మన శరీరం పోషకాలను శోషించుకుంటుంది. అలాగే మెటబాలిజం కూడా పెరుగుతుంది.
భోజనం చేసిన అనంతరం బెర్రీ పండ్లను తినాలి. వీటల్లో ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి మెటబాలిజంను పెంచుతాయి. జీర్ణక్రియను మెరుగు పరుస్తాయి. వీటిల్లో క్యాలరీలు తక్కువగా నీరు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల బెర్రీలను తింటుంటే మెటబాలిజంను పెంచుకోవచ్చు. బెర్రీ పండ్లలో స్ట్రాబెర్రీలు, చెర్రీలు, బ్లూ బెర్రీలు, రాస్ప్బెర్రీలు ముఖ్యమైనవి. వీటిని భోజనం చేశాక తినాలి. అలాగే కారం, మసాలాలు ఉన్న ఆహారాలను రోజూ కాకున్నా అప్పుడప్పుడు తింటుండాలి. ఇవి కూడా మెటబాలిజంను పెంచుతాయి. ఇక శరీర మెటబాలిజంను పెంచడంలో గ్రీన్ టీ కూడా సహాయం చేస్తుంది. భోజనం చేసిన తరువాత 1 గంట విరామం ఇచ్చి గ్రీన్ టీ తాగాలి. దీంతో శరీర మెటబాలిజం పెరుగుతుంది. క్యాలరీలు వేగంగా ఖర్చవుతాయి. అధిక బరువు తగ్గుతారు. అలాగే జీర్ణక్రియ మెరుగు పడుతుంది. ఇలా పలు రకాల ఆహారాలను తీసుకోవడం వల్ల మెటబాలిజంను పెంచుకోవచ్చు. జీర్ణక్రియ మెరుగు పడుతుంది.