సంగారెడ్డి : సంగారెడ్డి జిల్లా జోగిపేటలో(Jogipet) దారుణం చోటు చేసుకుంది. ఆస్తి(Property )కోసం కన్నతండ్రి ప్రాణాలనే(Father killed) తీశాడో ప్రబుద్ధుడు. వివరాల్లోకి వెళ్తే..జోగిపేటకు చెందిన కుమ్మరి నారాయణకు వీరేశం అనే కొడుకు ఉన్నాడు. తండ్రి ఆస్తిని ఎలాగైనా కాజేయాలని కుట్రపన్నిన వీరేశం. తండ్రిని ఉరివేసి చంపి ఆత్మహత్యగా చిత్రీకరించాడు. అనుమానం వచ్చిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ హాస్పిటల్కు తరలించారు. వీరేశంను పోలీస్ స్టేషన్కు తరలించి కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నారు. పూర్తి వివరారాలు తెలయాల్సి ఉంది. కాగా, నారాయణ మృతితో జోగిపేటలో విషాదఛాయలు అలుముకున్నాయి.