Vijay Deverakonda | హైదరాబాద్లోని తాజ్ కృష్ణ హోటల్లో బుధవారం రాత్రి జరిగిన సినీ జంట విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల గ్రాండ్ వెడ్డింగ్ రిసెప్షన్లో బిఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ పాల్గొన్నాడు. ఈ సందర్భంగా నవ దంపతులకు ఆయన ఎక్స్ వేదికగా ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు.
” విజయ్ దేవరకొండ – రష్మిక మీ ఇద్దరి మధ్య ఉన్న ప్రేమ ఎంత గొప్పదో.. మీ వైవాహిక జీవితం కూడా అంతే అద్భుతంగా, స్ఫూర్తిదాయకంగా సాగాలని కోరుకుంటున్నాను అంటూ సోషల్ మీడియా వేదికగా క్రిశాంక్ విష్ చేశాడు. అలాగే విజయ్ తండ్రి గోవర్ధన్ రావు గురించి ప్రస్తావిస్తూ.. గోవర్ధన్ గారు, మీరు నాకు ఎంతో స్ఫూర్తి అని రాసుకోచ్చాడు. ఈ వేడుకలో అంతకుముందు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దంపతులు వచ్చి నూతన వధువరులను ఆశీర్వదించారు.
Wishing you both @TheDeverakonda and @iamRashmika a marriage that’s as wonderful and inspiring as your love for one another .
God Bless the family …
Anand ✊🏽
Govardhan garu, you inspire me 🙏🏽 pic.twitter.com/pcLPiXYb6K— Dr.Krishank (@Krishank_BRS) March 5, 2026