Divvala Madhuri | తన ఆరోగ్యం మళ్లీ దెబ్బతిందని దివ్వల మాధురి తెలిపారు. రీసెంట్గా జరిగిన యాక్సిడెంట్‌తో అయిన బ్లడ్ క్లాట్ మళ్లీ ఇబ్బందిపెడుతోందని వెల్లడించారు. డాక్టర్లు విశ్రాంతి తీసుకోవాలని సూచించారని.. 10 రోజుల తర్వాత మళ్లీ అందరి ముందుకొస్తానని చెప్పారు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్టు పెట్టారు.
‘ మీ అందరి సపోర్టుతో నాకు చాలా ధైర్యంగా ఉంది. ఇదే సపోర్టుతో ముందుకు వెళ్లాలని అనుకుంటున్నా. కానీ మళ్లీ హెల్త్ ప్రాబ్లెం వచ్చింది. క్లాట్ మళ్లీ ఎక్కువై బ్లడ్ బ్లీడ్ అవుతుంది. డాక్టర్లు విశ్రాంతి తీసుకోవాలని చెప్పారు. మాట్లాడలేకపోతున్నా. అందుకే కొద్దిరోజులు సోషల్‌మీడియాకు దూరంగా ఉండాలని అనుకుంటున్నా. మళ్లీ 10 రోజుల తర్వాత లైవ్‌కు వస్తాను. మీ అందరితో మాట్లాడతాను. నన్ను సపోర్టు చేసినందుకు చాలా థ్యాంక్స్.’ అని దివ్వల మాధురి సోషల్‌మీడియాలో పోస్టు చేశారు.
వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ వివాదాలతో దివ్వల మాధురిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. దువ్వాడ శ్రీనుతో సంబంధం పెట్టుకుందనే ఆరోపణల నేపథ్యంలో వాణి, దివ్వల మాధురి మధ్య మాటల యుద్ధం కూడా నడిచింది. ఈ క్రమంలో తీవ్ర యాక్సిడెంట్ చేసుకోవాలని నిర్ణయించుకున్న మాధురి.. గత ఆదివారం నాడు కారులో హైవేపైకి వెళ్లింది. టెక్కలి నుంచి పలాస వెళ్తుండగా లక్ష్మీపురం టోల్‌గేటుకు సమీపంలో ఆగివున్న కారును ఢీకొట్టారు. ఈ ప్రమాదంలోనే మాధురి తలకు తీవ్ర గాయమైంది.