Emergency Movie | బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ (Kangana Ranaut) స్వీయ దర్శకత్వంలో వస్తున్న తాజా చిత్రం ‘ఎమర్జెన్సీ’ (Emergency). దివంగత భారత ప్రధాని ఇందిరాగాంధీ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన ఈ సినిమాలో ఇందిరాగాంధీగా కంగనా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం గతేడాది నవంబరు 24న విడుదల కావాల్సి ఉండగా.. అనుకోని కారణాల వలన విడుదల వాయిదా పడింది. ఆ తర్వాత జూన్ 14న విడుదల చేయానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే ఈ క్రమంలోనే కంగనా పొలిటికల్ ఎంట్రీ ఇవ్వడం హిమచల్ ప్రదేశ్ ‘మండి’ నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటి చేసి గెలవడంతో రాజకీయల్లో బిజీ అయ్యి ఈ సినిమా మళ్లీ వాయిదా పడింది.
ఇదిలావుంటే.. తాజాగా ఈ సినిమాను దసరా కానుకగా సెప్టెంబర్ 06న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం వెల్లడించింది. అయితే విడుదల తేదీ దగ్గరపడటంతో వరుస ప్రమోషన్స్‌లో పాల్గోంటుంది కంగనా. ఈ క్రమంలోనే తాను ఎందుకు ఖాన్లు, కపూర్లతో సినిమాలు చేయనో వెల్లడించింది.
షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, ఆమీర్ ఖాన్‌లా సినిమాల నుంచి నాకు అవకాశం వచ్చినప్పుడు నేను రిజెక్ట్ చేశాను. అందరూ ఖాన్‌లతో నాకు మంచి రిలేషన్ ఉంది. వాళ్లు నాతో ఎప్పుడు తప్పుగా ప్రవర్తించలేదు. అయితే నాతో తప్పుగా ప్రవర్తించిన నటులు చాలా ఉన్నారు. అందులో ఖాన్స్ లేరు. కానీ నేను వారి చిత్రాలకు నో చెప్పాను, ఎందుకంటే వారి చిత్రాలలో హీరోయిన్ రెండు సన్నివేశాలతో అలాగే ఒక పాటలో కనిపించి వెళుతుంది. కాబట్టి నేను అలా చేయకూడదని నిర్ణయించుకున్నాను. ఖాన్‌లతో పనిచేయకుండా ఏ లిస్ట్‌లో ఉన్న నటిగా నేను గుర్తింపు తెచ్చుకోవాలి అనుకున్నాను అందుకే నటించలేదు.
నా తర్వాత ఇండస్ట్రీకు వచ్చే మహిళల కోసం నా వంతు కృషి చేయాలని నేను కోరుకున్నాను అందుకే ఇలాంటి నిర్ణయం తీసుకున్నాను. అండ్ మీ దగ్గర ప్రతిభ లేకపోతే ఏ ఖాన్ ఏం చేయలేడు. ఏ అక్షయ్ కుమార్ ఏం చేయలేడు. ఏ కపూర్ మిమ్మల్ని సక్సెస్ చేయలేడు. నేను అందుకే ఖాన్‌లతో పాటు రణబీర్ కపూర్ సినిమాలకు నో చెప్పాను, అక్షయ్ కుమార్ సినిమాలకు నో చెప్పాను. ఒక హీరో మాత్రమే హీరోయిన్ని సక్సెస్ చేయగలడనే ప్రోటోటైప్‌గా నేను ఉండాలనుకోలేదు. మీరు మీ స్వంతంగా కూడా విజయం సాధించగలరు. దానికి ఉదాహరణ నేనే అంటూ కంగనా చెప్పుకొచ్చింది.
Also Read..