హైదరాబాద్: హైదరాబాద్‌లోని (Hyderabad) స్పా సెంటర్లు, సెలూన్లపై పోలీసులు దాడులు చేశారు. చందానగర్‌లోని స్పాలో నలుగురు యువతులు, ముగ్గురు విటులను అరెస్టు చేశారు. స్పా ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్నారని గుర్తించారు. కచ్చితమైన సమాచారంతో హ్యూమన్ ట్రాఫికింగ్ పోలీసులు దాడిచేశారు.
మరో ఘటనలో కేపీహెచ్‌బీ నాలుగో రోడ్డులోని సెలూన్ షాపుపై పోలీసులు దాడులు చేశారు. ముగ్గురు యువతులు, ఇద్దరు విటులను అదుపులోకి తీసుకున్నారు. సెలూన్, స్పా ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని బార్లు, పబ్‌లపై ఆకస్మిక దాడులు చేశారు. హైదరాబాద్‌లో 12, రంగారెడ్డిలో 13 బార్లు, పబ్బుల్లో తనిఖీలు నిర్వహించారు.