Bunny Vasu – AAY Movie | మ్యాడ్ చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్న కథానాయకుడు, ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్ హీరోగా, నయన్ సారిక హీరోయిన్గా రూపొందిన చిత్రం ‘ఆయ్’. అంకిత్ కొయ్య, రాజ్‌కుమార్ కసిరెడ్డి, వినోద్‌కుమార్ ఇతర ముఖ్యపాత్రల్లో నటించిన ఈ చిత్రం ఇటీవల ఆగస్టు 15న విడుదలైంది. గోదావరి బ్యాక్‌డ్రాప్‌లో అల్లు అరవింద్ సమర్పణలో అంజి.కె.మణిపుత్ర దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. బన్నీవాస్, విద్యా కొప్పినీడిలు ఈ చిత్రాన్ని నిర్మించారు. అయితే ఆగస్టు 15న ఈ చిత్రం భారీ పోటీలో విడుదలైన సంగతి తెలిసిందే.
రవితేజ, హరీశ్ శంకర్ల ‘మిస్టర్ బచ్చన్’. పూరి-రామ్‌ల డబుల్ ఇస్మార్ట్, విక్రమ్ తంగలాన్.. ఇలా మూడు భారీ చిత్రాలతో పోటీ పడి థియేటర్లో ఈ చిత్రం విడుదలైంది. అయితే మిస్టర్ బచ్చన్, డబుల్ ఇస్మార్ట్ల చిత్రాలు డిజాస్టర్ చిత్రాలుగా ప్రేక్షకులు తీర్పునిచ్చారు. ఇక తంగలాన్ విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్నా.. కమర్షియల్ అంశాలు లేకపోవడంతో డాక్యుమెంటరీ చిత్రం అనే ఫీల్ రావడంతో ఈ చిత్రానికి ఆదరణ కూడా అంతంత మాత్రమే వుంది. అయితే ఇక పోటీలో నిలబడి అందరి ప్రశంసలు దక్కించుకున్న చిత్రం ఆయ్ అనే చెప్పాలి. పూర్తి వినోదాత్మకంగా రూపొందిన ఈ చిత్రంలో ఎంటర్టైన్మెంట్ వర్కవుట్ అవడంతో ఆయ్ మంచి టాక్‌నే సొంతం చేసుకుంది. దీనికి రివ్యూలతో పాటు కలెక్షన్లు కూడా ఆశాజనకంగానే వున్నాయని విమర్శకులు చెబుతున్నారు. అంతేకాదు ట్రేడ్ వెబ్‌సైట్స్ కూడా ఆయ్ చిత్రం హౌస్‌ఫుల్ కలెక్షన్స్‌తో రన్ అవుతోందని చెబుతున్నాయి.
అయితే నిన్న జరిగిన ప్రెస్మీట్లో ఓ జర్నలిస్ట్ మీ చిత్రం వసూళ్ల పరంగా కూడా రేజింగ్‌లో వుంది కదా… మీ ఫీలింగ్ ఏంటనని నిర్మాత బన్నీవాసును ప్రశ్నిస్తే…ఆయన మాత్రం ఇంకా సినిమా నలిగిపోతుంది.. ఇంకా మేం జాకీలు వేసి సినిమాను లేపాలి.. కలెక్షన్లు ఇంకా పెరగాలి అన్నాడు. దీంతో అక్కడున్న వారందరూ ఇదేంటి సినిమా హిట్ అని ప్రచారం చేస్తున్నారు బన్నీవాసు ఇలా అన్నాడేంటి అంటూ చర్చించుకున్నారు. అయితే బయట ట్రేడ్ వర్గాలు చెబుతున్న కలెక్షన్లు నిజమా? బన్నీ వాసు చెబుతున్నట్లు ఆయ్ కలెక్షన్లు అంతంత మాత్రం అంటున్నది నిజమా అనేది తేల్సాలి వుంది.