Musi Victim | గత కేసీఆర్ ప్రభుత్వంలో మూసీ సుందరీకరణలో భాగంగా నిర్మించిన నాగోల్ STPని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యేలు ముఠా గోపాల్, సుదీర్ రెడ్డి, లక్ష్మారెడ్డి, కాలేరు వెంకటేష్, ఎమ్మెల్సీ వాణి దేవి ఇతర నాయకులతో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా వారు బాధితులతో మాట్లాడారు. ఓ అవ్వ తన ఆవేదనను వ్యక్తం చేసింది. నేను కూడా మూసీ బాధితురాలినే.. మొదటిసారి హైడ్రా వచ్చినప్పుడు నా కోడలు నిండు గర్భిణీ. అయినా బయట నిలబెట్టి.. నాకు గుండె దడ ఉండేది. నేను ఇళ్లల్ల పనిచేసుకునేదాన్ని. మా ఆయన 30 ఏళ్ల కిందట చచ్చిపోయిండు. నాకు పెళ్లి కావాల్సిన పిల్ల ఉంది. ఇప్పుడు ఇల్లు కూలుస్తానంటే నేను ఎలా ఓర్చుకునేది. మేము చాలా బాధలు పడి ఇల్లు కట్టినం. మా పెద్ద మనవడు పుట్టినపుడు కేసీఆర్ కిట్ వచ్చింది. రేవంత్ వచ్చినంక ఏ కిట్ రాలేదు. ఈ సార్ (కేటీఆర్) వచ్చి మేమున్నం అమ్మ అంటూ ధైర్యమిచ్చిండు.
రేవంత్ రెడ్డి వచ్చినంక కష్టాలు పెట్టిండు. సంవత్సరం నుంచి నేను తిండి తిప్పలు మానేసి నాకు ఎదిగిన 18 ఏళ్ల పిల్ల ఉంది. ఇల్లు కూల్చుకొని పెండ్లి ఎట్ల చేయాలి. నాకు ఇద్దరు కొడుకులు. నా చిన్నకొడుకు ఆరోగ్యం కూడా బాగుండదు. నేను చచ్చిపోయినా చచ్చిపోతా.. నా ఇల్లు కూలగొట్టొద్దు అని ఎడ్చిన. అప్పుడు నా కొడుకు వచ్చి పెట్రోలు కూడా పోసుకుండు. ఒట్లేసి గెలిపిస్తే ఆ రేవంత్ రెడ్డి వచ్చి ఏం చేస్తుండు. ఆయన ఏం చేయలే. కేసీఆర్ ఉండంగ రూ.2 వేల పెన్షన్ ఇచ్చిండు. ఇయ్యాళ ఆ రెండువేలే ఇస్తుండు.. ఆయన మూసీని మంచిగ చేసుకుంటే చేసుకోమను. మా ఇండ్ల నుంచి పోనివ్వం.. అంటూ ధ్వజమెత్తింది.
మూసీ పరివాహక ప్రాంత ప్రజలను బయపెట్టే ప్రయత్నం చేస్తున్నారని.. రేవంత్‌కు రూ.16 వేల కోట్లతో మూసీని సుందరీకరించడం చేతకాకపోతే మేము చేసి చూపిస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ సందర్భంగా సవాల్ విసిరారు.
మేము చావనైనా చస్తాం కాని మా ఇల్లు అయితే ఇవ్వము – మూసీ బాధితురాలు https://t.co/KXEuSEGI3a pic.twitter.com/Vh0wVfLie6
— Telugu Scribe (@TeluguScribe) March 5, 2026