నర్సాపూర్: ఉచితాలు, ప్రత్యేక ఆఫర్లు, డిస్కౌంట్లు అంటే చాలు జనాలు ఎగబడిపోతున్నారు. ప్రజలను ఆశను వ్యాపారులు సొమ్ముచేసుకుంటున్నారు. సోషల్ మీడియాలో ప్రత్యేక ఆఫర్ అంటూ ఓ బట్టల షాపు యజమాని సోషల్ మీడియాలో చేసిన ప్రకటనను చూసిన యువత పొలోమంటూ ఆ దుకాణం ముందు వాలిపోయారు. అసలే అగ్గువకు వస్తున్నదాయే.. ఎలాగైనా దక్కించుకోవాలనుకున్నారు. ఒకరినొకరు తన్నుకున్నారు. పరిస్థితి గందరగోళంగా మారడంతో ఆ షాపు యజమాని అక్కడి నుంచి ఉడాయించిన ఘటన మెదక్ జిల్లా నర్సాపూర్‌లో (Narsapur) జరిగింది.
నర్సాపూర్ పట్టణంలోని ‘చేతన్ మేన్స్ వేర్’ అనే బట్టల షాపు ఓనర్ చేతన్.. 2 రూపాయలకే అంగి అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ రీల్ పోస్ట్ చేశాడు. అదీ సోమవారం ఉదయం 11 నుంచి 11.10 గంటల వరకు మాత్రమేనని అందులో పేర్కొన్నాడు. ఈ అవకాశాన్ని నర్సాపూర్ చుట్టుపక్కల వారంతా ఉపయోగించుకోవాలని కోరాడు. సోషల్ మీడియాలో ఆ పోస్ట్ చూస్తుండగానే వైరల్ అయిపోయింది. ఇంకేముంది సోమవారం రానేవచ్చింది. ఉదయం 11 అయింది.
చేతన్ మేన్స్ వేర్ షాప్ వద్ద చూస్తుండగానే యువకులు పెద్ద సంఖ్యలో గుమికూడారు. ఉన్నది 10 నిమిషాలే. చూస్తే భారీగా జనం ఉన్నారు. దీంతో ఒకరినొకరు తోసుకున్నారు. క్షణాల్లో అక్కడ గందరగోళం ఏర్పడింది. ఇదంతా చూసిన షాపు ఓనర్ చేతన్ బెంబేలెత్తిపోయాడు. దుకాణం బంద్ చేసి అక్కడి నుంచి ఉడాయించాడు. సమాచారం అందుకున్న పోలీసులు షాప్ వద్దకు చేరుకున్నారు. యువకులను అక్కడి నుంచి పంపించేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. షాప్ ఓనర్ చేతన్ కోసం గాలిస్తున్నారు.
Viral news | రూ.35కే చీర.. షాపింగ్ మాల్ ముందు బారులు తీరిన మహిళలు
Nitish Reddy | టీమిండియాకు వరుస ఎదురుదెబ్బలు.. మోకాలి గాయంతో నితీశ్ ఔట్
Cantonment MLA | నాపై దాడికి యత్నించింది మా పార్టీ వారే.. కంటోన్మెంట్ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు