Amazon Off To College Sale 2025 | ఈమధ్య కాలంలో ఆన్లైన్ షాపింగ్ సైట్లలో ప్రత్యేక సేల్స్ జోరు పెరిగిందని చెప్పవచ్చు. మొన్నీ మధ్యే అమెజాన్‌లో ప్రైమ్ డే సేల్‌ను నిర్వహించారు. తరువాత ఎలక్ట్రానిక్ డేస్ సేల్‌ను నిర్వహించగా ఇప్పుడు మరో కొత్త సేల్‌ను ప్రారంభించారు. అయితే ఇప్పుడు ప్రారంభించిన సేల్ మాత్రం విద్యార్థుల కోసం కావడం విశేషం. అమెజాన్ సైట్లో ఆఫ్ టు కాలేజ్ పేరిట ఓ ప్రత్యేకమైన సేల్‌ను విద్యార్థుల కోసం ప్రారంభించారు. ఇందులో భాగంగా పలు కంపెనీలకు చెందిన ఉత్పత్తులపై విద్యార్థులకు భారీ ఎత్తున రాయితీలను ఆఫర్లను అందిస్తున్నారు. ఈ సేల్‌లో భాగంగా పలు టాప్ బ్రాండ్లకు చెందిన ఉత్పత్తులను డిస్కౌంట్ ధరలకే కొనుగోలు చేయవచ్చు.
ఈ సేల్‌లో అసుస్, లెనోవో, హెచ్‌పీ, డెల్ వంటి కంపెనీలకు చెందిన ల్యాప్‌టాప్‌లను తగ్గింపు ధరలకు అందిస్తున్నారు. పలు గ్యాడ్జెట్లపై ఏకంగా 60 శాతం వరకు తగ్గింపు లభిస్తోంది. ల్యాప్‌టాప్‌లు, ట్రూవైర్‌లెస్ ఇయర్‌బడ్స్, ఇతర గ్యాడ్జెట్లను తగ్గింపు ధరలకు కొనుగోలు చేయవచ్చు. ఈ సేల్ ఈ నెల 27వ తేదీ వరకు కొనసాగనుంది. ఇందులో భాగంగా ఏసర్ ఆస్పయిర్ లైట్ ప్రీమియం థిన్ అండ్ లైట్ ల్యాప్‌టాప్‌ను విద్యార్థులు రూ.34,990 ధరకు కొనుగోలు చేయవచ్చు. లెనోవో ఐడియాప్యాడ్ స్లిమ్ 3 ల్యాప్‌టాప్ ధర రూ.38,990గా ఉంది. హెచ్‌పీ 15 ల్యాప్‌టాప్‌ను రూ.55,990 ధరకు అందిస్తున్నారు. ఇందులో ఇంటెల్ కోర్ ఐ5-1334యు ప్రాసెసర్ ఉంది.
ఈ సేల్‌లో అసుస్ వివోబుక్ 16ఎక్స్ క్రియేటర్ లేదా గేమింగ్ ల్యాప్ టాప్ ధర రూ.56,990గా ఉంది. డెల్ ఇన్స్పిరాన్ 3530 ల్యాప్‌టాప్ ధర రూ.57,490గా ఉంది. హెచ్‌పీ విక్టస్ గేమింగ్ ల్యాప్‌టాప్‌ను రూ.62,990 ధరకు కొనుగోలు చేయవచ్చు. లెనోవో ఎల్వోక్యూ ల్యాప్‌టాప్‌ను రూ.68,490 ధరకు విక్రయిస్తున్నారు. ఈ సేల్‌లో వన్ ప్లస్ ప్యాడ్ గో ట్యాబ్‌ను రూ.16,999 ధరకు కొనుగోలు చేయవచ్చు. లెనోవో ట్యాబ్ ప్లస్ ను రూ.18,199 ధరకు అందిస్తున్నారు. శాంసంగ్ గెలాక్సీ ట్యాబ్ ఎ9 ప్లస్ ను రూ.20,999 ధరకు కొనవచ్చు. రెడ్ మీ ప్యాడ్ ప్రొ 5జి ట్యాబ్‌ను రూ.20,999 ధరకు, షియోమీ ప్యాడ్ 7 ట్యాబ్‌ను రూ.27,999 ధరకు అందిస్తున్నారు.
ఈ సేల్‌లో లెనోవో ఐడియా ట్యాబ్ ప్రొ ను రూ.30,999 ధరకు, వన్‌ప్లస్ ప్యాడ్ 2 ట్యాబ్‌ను రూ.39,999కు, యాపిల్ ఐప్యాడ్ టెన్త్ జనరేషన్ ట్యాబ్‌ను రూ.44,900 ధరకు కొనవచ్చు. అలాగే ఫైర్ బోల్డ్, రెడ్మీ వాచ్, అమేజ్‌ఫిట్, నాయిస్, వన్‌ప్లస్ వాచ్, గెలాక్సీ వాచ్ వంటి స్మార్ట్ వాచ్‌లను కూడా భారీ తగ్గింపు ధరలకు అందిస్తున్నారు. పీట్రాన్, బోట్, వన్‌ప్లస్, సోనీ, జేబీఎల్, నాయిస్ వంటి కంపెనీలకు చెందిన ఇయర్ బడ్స్‌ను సైతం తగ్గింపు ధరలకు అందిస్తున్నారు. ఈ సేల్‌లో భాగంగా హెచ్డీఎఫ్సీ బ్యాంకు కార్డులతో ఉత్పత్తులను కొనుగోలు చేస్తే రూ.4500 ఇన్స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. యాక్సిస్ బ్యాంకు కార్డులతో రూ.2వేల ఇన్ స్టంట్ డిస్కౌంట్ ఇస్తారు. యెస్ బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ బరోడా కార్డులకు రూ.1750, హెచ్ఎస్బీసీ కార్డులకు రూ.1500, వన్‌కార్డ్ క్రెడిట్ కార్డులకు రూ.3500 ఇన్ స్టంట్ డిస్కౌంట్‌ను అందిస్తున్నారు. మరిన్ని వివరాలకు విద్యార్థులు అమెజాన్‌లో సేల్ జరుగుతున్న పేజీని సందర్శించవచ్చు.