గద్వాల : ఏదైనా ఆఫర్ ఉందంటే చాలు పనిగట్టుకుని అక్కడ వాలిపోయే వాళ్లు చాలామంది ఉన్నారు. అందుకే వ్యాపారులు రకరకాల ఆఫర్లతో వినియోగదారులను ఆకర్షిస్తున్నారు. తాజాగా జోగులాంబ గద్వాల జిల్లాలో కాసమ్ షాపింగ్ మాల్లో రూ.35కే చీర ఆఫర్ ప్రకటించారు.
దాంతో స్థానిక మహిళలు పెద్ద సంఖ్యలో ఉదయం షాపింగ్ మాల్ తీయకముందే అక్కడికి చేరుకున్నారు. ఇంట్లో పనులను పక్కనపెట్టి మరీ షాపింగ్ మాల్ దగ్గర క్యూలైన్లో నిలబడ్డారు. షాప్ తీయకముందే మహిళలు భారీ సంఖ్యలో బారులు తీరడం చూసి ఆ మార్గంలో వెళ్లేవాళ్లు ఆశ్చర్యపోతున్నారు.