గురువారం 28 మే 2020
Telangana - May 16, 2020 , 06:51:57

టిప్పర్‌ను ఢీకొట్టిన్న స్కార్పియో.. ముగ్గురు మృతి

టిప్పర్‌ను ఢీకొట్టిన్న స్కార్పియో.. ముగ్గురు మృతి

నిజామాబాద్‌: జిల్లాలోని డిచ్‌పల్లి మండలం నాకతండా వద్ద జరిగిన కారు ప్రమాదంలో ముగ్గురు మృతిచెందారు. కేరళ రిజిస్ట్రేషన్‌తో ఉన్న స్కార్పియో కారు 44వ జాతీయ రహదారిపై ఆగి ఉన్న టిప్పర్‌ను వెనకనుంచి ఢీకొట్టింది. దీంతో ముగ్గురు మృతిచెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను నిజామాబాద్‌లోని దవాఖానకు తరలించారు. మృతుల్లో ఏడాదిన్నర వయస్సు కలిగిన చిన్నారి కూడా ఉన్నది. వీరు కేరళలోని కోజికోడ్‌కు చెందినవారని, బీహార్‌లోని నవాడా నుంచి కేరళ వెళ్తున్నారని పోలీసులు వెల్లడించారు. బీహార్‌లో ఓ ప్రైవేటు పాఠశాలను నడుపుతున్నారని తెలిపారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 


logo