ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పంట.. కేజీ రూ. లక్ష
అత్యంత ఖరీదైన పంట | ఈ పంట ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనది. కేజీ పదో, వంద రూపాయాలు కాదు.. ఏకంగా ఆ పంట చేతికొచ్చిన తర్వాత అమ్మితే అంతర్జాతీయ మార్కెట్లో కిలో ధర రూ. లక్ష పలుకుతుంది.

ఈ పంట ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనది. కేజీ పదో, వంద రూపాయాలు కాదు.. ఏకంగా ఆ పంట చేతికొచ్చిన తర్వాత అమ్మితే అంతర్జాతీయ మార్కెట్లో కిలో ధర రూ. లక్ష పలుకుతుంది. ఇది అక్షరాల నిజం. మరి ఆ పంటను ఎక్కడ పండిస్తున్నారు. ఎవరు పండిస్తున్నారు. ఆ పంటకు అంత డిమాండ్ ఎందుకు.. అనే విషయాలను పరిశీలిద్దాం.
బీహార్ ఔరంగాబాద్ జిల్లాలోని కర్మనిధ్ గ్రామానికి చెందిన అమరేశ్ సింగ్(28) వ్యవసాయంపై మక్కువ పెంచుకున్నాడు. తనకు 1500 సెంట్ల భూమిలో వినూత్నమైన పంటలు సాగు చేయాలని సంకల్పించాడు. భారతదేశంలోనే తొలిసారిగా హుప్ షూట్స్ అనే పంటను పండించాలని నిర్ణయం తీసుకున్నాడు. ఈ క్రమంలో వారణాసిలోని ఇండియన్ వెజిటబుల్ రిసెర్చ్ ఇన్సిట్యూట్ శాస్ర్తవేత్తలను సంప్రదించాడు. ఆ శాస్ర్తవేత్తల సలహాలు, సూచనల మేరకు రెండు నెలల క్రితం హుప్ షూట్స్ అనే పంటను సాగు చేయడం ప్రారంభించాడు. ఇప్పటికే 60 శాతం పంట పూర్తయింది. అయితే ఈ పంటకు అంతర్జాతీయ మార్కెట్లో ఆరేండ్ల క్రితమే కిలోకు వెయ్యి పౌండ్లుగా ధర పలికింది. ఈ ధర ప్రకారం ప్రస్తుతం కిలో హాప్ షూట్స్ ఖరీదు రూ. లక్ష ఉంటుందని అంచనా వేస్తున్నారు.
హాప్ షూట్స్ ఔషధాల గని!
అత్యంత ఖరీదైన హాప్ షూట్స్ లో ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. వీటి పూలు, పండ్లు, కాడలను యాంటీ బయాటిక్స్ వంటి ఔషధాల తయారీలోనూ వినియోగిస్తున్నారు. అంతేకాకుండా ఈ పూలను ప్రత్యేకంగా బీర్ల తయారీలో ఉపయోగించారు. హాప్ షూట్స్ తో తయారు చేసిన ఔషధాలు టీబీ వంటి వ్యాధుల నియంత్రణకు మెరుగ్గా పని చేస్తాయి. ఈ మొక్కల్లో ఉండే హ్యుములోన్స్, ల్యూపులోన్స్ అనే ఆమ్లాలు.. క్యాన్సర్ కణాలను నిర్మూలించేందుకు ఉపయోగపడుతాయి. నిద్రలేమితో పాటు ఒత్తిడిని కూడా నయం చేస్తుంది. ఈ మొక్కలో యాంటీ ఆక్సిడెంట్లు మెండుగా ఉన్నందున.. ఐరోపా వాసులు సౌందర్య సాధనంగానూ ఉపయోగిస్తారు. హాప్ షూట్స్ కాడ కొంచెం చేదుగా ఉన్నప్పటికీ నేరుగా తినొచ్చు. క్రమంగా కూరగాయల పంటగానూ ఇది ప్రసిద్దిలోకి వచ్చింది.
ఈ పంటకు ఏ వాతావరణం అనుకూలం?
హాప్ షూట్స్ పంటకు చల్లగా ఉండే వాతావరణం సరిపడదు. ఎండకాలం ఈ పంట సాగుకు అనువైన సమయం. మార్చి నుంచి జూన్ మధ్యలో హాప్ షూట్స్ సాగును ప్రోత్సహిస్తారు. తగినంత తేమ, సూర్యరశ్మి ఉంటే మొక్కలు వేగంగా పెరుగుతాయి.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

