ఆస్ట్రాజెనికా టీకా అవసరంరాదేమో : అమెరికా

చికాగో: ఆస్ట్రాజెనికా టీకా తమకు అవసరం రాదేమో అన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు అమెరికా అంటువ్యాధుల సంస్థ నిపుణులు డాక్టర్ ఆంథోనీ ఫౌసీ. ఒకవేళ ఆ టీకాకు సీడీసీ నుంచి ఆమోదం దక్కినా.. తమ వద్ద కావాల్సినన్ని ఇరత టీకాలు ఉన్నాయని, ఆస్ట్రాజెనికా అవసరంరాదన్న అభిప్రాయాన్ని ఆయన వెలుబుచ్చారు. కోవిడ్19 మహమ్మారి నిర్మూలనలో కీలకంగా భావించిన ఆస్ట్రాజెనికా టీకాపై ఇప్పుడు విమర్శలు వస్తున్నాయి. ఇతర వ్యాక్సిన్ తయారీ సంస్థలతో అమెరికా అనేక ఒప్పందాలు కుదుర్చుకున్నదని, ఆ ఒప్పందాల ప్రకారం అమెరికా ప్రజలందరికీ టీకాలు ఇవ్వవచ్చు అని, ఆస్ట్రాజెనికా అవసరం తమకు రాదన్న విషయాన్ని ఆంథోనీ ఫౌసీ వెల్లడించారు. ఆస్ట్రాజెనికా టీకా తీసుకున్నవారిలో రక్తం గడ్డకడుతున్నట్లు కొన్ని కేసులు నమోదు కావడంతో ఆ టీకాపై కొన్ని దేశాలు నిషేధం విధించాయి. జాన్సన్ అండ్ జాన్సన్, నోవావాక్స్, మోడెర్నాలతో ఉన్న కాంట్రాక్టు ప్రకారం అధిక సంఖ్యలోనే తమకు కోవిడ్ టీకాలు అందనున్నట్లు ఫౌసీ తెలిపారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- AstraZeneca
- Covid vaccine
- Fauci
- US
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

