Saree Run | అతివల్లో ఆత్మవిశ్వాసం పెంచడం, మహిళా సాధికారత, స్త్రీలలో ఆరోగ్యం పట్ల అవగాహన కల్పించడం వంటి అంశాలను దృష్టిలో ఉంచుకుని తనైరా కంపెనీతో పాటు బెంగళూరుకు చెందిన ఫిట్ నెస్ కంపెనీ జేజే యాక్టివ్ హైదరాబాద్‌లో ‘శారీ రన్’ (Saree Run) కార్యక్రమం నిర్వహించింది. ఆదివారం ఉదయం పీపుల్స్ ప్లాజా ( people Plaza) వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో మహిళలు వేలాదిగా పాల్గొన్నారు. దాదాపు 3 వేల మందికిపైగా మహిళలు సంప్రదాయ చీరకట్టులో ఉత్సాహంగా పాల్గొని సందడి చేశారు.
హెరిటేజ్ ఫుడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నారా బ్రాహ్మణి జెండా ఊపి ఈ రన్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నారా బ్రాహ్మణి మాట్లాడుతూ.. సంప్రదాయ చీరకట్టుతో మహిళలకు ప్రత్యేక గుర్తింపు వస్తుందని అన్నారు. మరోవైపు కార్యక్రమంలో పాల్గొన్న మహిళలు నారా బ్రాహ్మణితో సెల్ఫీలు తీసుకుంటూ సందడి చేశారు.
Also Read..
Avalanche | బండిపోరాను ముంచెత్తిన అవలాంచ్‌లు
Cotton candy | పీచు మిఠాయి విక్రయాలు హిమాచల్‌లోనూ నిషేధం.. ప్రభుత్వం ఉత్తర్వులు