Avalanche | ఉత్తరాదిపై గత కొన్ని రోజులుగా భారీగా మంచు పడుతోంది. జమ్మూ కశ్మీర్ (Jammu and Kashmir), హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లోని ప్రముఖ పర్యాటక ప్రదేశాల్లో అడుగుల మేర మంచు పేరుకుపోయింది. ఈ క్రమంలో అక్కడక్కడా అవలాంచ్లు (Avalanche) ఏర్పడుతున్నాయి.
తాజాగా జమ్మూ కశ్మీర్లోని బండిపోరా (Bandipora)లో భారీ హిమపాతం (అవలాంచ్, మంచు ఉప్పెన) ముంచెత్తింది. అక్కడ కొన్ని అవలాంచ్లు ఏర్పడ్డాయి. దీంతో బండిపోరా – గురేజ్ రహదారి మంచు కారణంగా బ్లాక్ అయ్యింది. రంగంలోకి దిగిన బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ అవలాంచ్ల కారణంగా రోడ్డుపై పడిన హిమపాతాన్ని క్లియర్ చేసే పనులు చేపట్టింది.
కశ్మీర్ ప్రాంతంలో అవలాంచ్లు ఏర్పడటం సర్వసాధరణమే. అక్కడ రికార్డు స్థాయిలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతుంటాయి. అలాంటి సమయంలోనే అక్కడక్కడా అవలాంచ్లు ఏర్పడతాయి. భారీ ఎత్తున మంచు ఒక్కసారిగా విపరీతమైన వేగంతో కొండలపై నుంచి కిందకు రావడాన్ని అవలాంచ్ (మంచు తుపాను) అంటారు. దీనివల్ల ఒక్కోసారి ప్రాణ నష్టం ఎక్కువగా ఉంటుంది.
#WATCH | Bandipora, J&K: Multiple snow avalanches have blocked Bandipora-Gurez road. Border Roads Organisation (BRO) has commenced an extensive clearance operation in the snow avalanche-hit area.
(Video Source: BRO) pic.twitter.com/kDnk1BI9il
— ANI (@ANI) March 17, 2024
Also Read..
Cotton candy | పీచు మిఠాయి విక్రయాలు హిమాచల్లోనూ నిషేధం.. ప్రభుత్వం ఉత్తర్వులు
Sidhu Moose Wala | మగబిడ్డకు జన్మనిచ్చిన సిద్ధూ మూసేవాలా తల్లి.. ఫొటో షేర్ చేసిన గాయకుడి తండ్రి