Hardik Pandya : భారత ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా (Hardik Pandya) మరోసారి రెచ్చిపోయాడు. ఈమధ్యే దక్షిణాఫ్రికాపై మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడిన పాండ్యా.. విజయ్ హజారే ట్రోఫీ (VHT)లోనూ పూనకం వచ్చినట్టు చెలరేగాడు. లిస్ట్ – ఏ క్రికెట్లో విధ్వంసక ఆటతో మొట్టమొదటి సెంచరీ బాదేశాడీ హిట్టర్. బరోడా తరఫున బరిలోకి దిగిన ఈ చిచ్చరపిడుగు విదర్భ బౌలర్లకూ చుక్కలు చూపిస్తూ 68 బంత్లులోనే శతక గర్జన చేశాడు.
హిట్టర్టందు హార్దిక్ పాండ్యా వేరయా అనే మాట మనకు తెలిసిందే. ముఖ్యంగా టీ20లు అంటే చాలు తనలోని విధ్వంసక ఆటగాడిని బయటకు తీసుకొస్తాడీ క్రికెటర్. ఆసియా కప్ తర్వాత సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీతో పునరాగమనం చేసిన అతడు వస్తూ వస్తూనే అర్ధ శతకంతో రెచ్చిపోయాడు.
6️⃣ 6️⃣ 6️⃣ 6️⃣ 6️⃣ 4️⃣
Hardik Pandya brings up his maiden List-A 💯 in some style 💪pic.twitter.com/MJp0QtsAkt
— ESPNcricinfo (@ESPNcricinfo) January 3, 2026
అనంతరం సఫారీలకు తన బ్యాట్ పవర్ చూపించిన పాండ్యా.. ఇప్పుడు విజయ్ హజారే ట్రోఫీలోనూ ఊచకోత కోశాడు. విదర్భ బౌలర్లను హడలెత్తించిన బరోడా స్టార్.. స్పిన్నర్ రెఖాడే వేసిన 39వ ఓవర్లో మరింత రెచ్చిపోయాడు. వరుసగా 6, 6, 6, 6, 6, 4 బాది 34 రన్స్ పిండుకున్నాడు. బంతి గమ్యం బౌండరీయే అన్నట్టుగా విధ్వంసం సృష్టించిన పాండ్యా 68 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. లిస్ట్ – ఏ క్రికెట్లో అతడికిది తొలి శతకం కావడం విశేషం.