Suriya 46 | కోలీవుడ్ యాక్టర్ సూర్య బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నాడని తెలిసిందే. ఈ ప్రాజెక్టుల్లో ఒకటి వెంకీ అట్లూరి డైరెక్ట్ చేస్తున్న సూర్య 46 (Suriya 46). ఈ మూవీలో ప్రేమలు ఫేం మమితా బైజు హీరోయిన్గా నటిస్తుండగా.. సీనియర్ నటి రవీనా టాండన్ కీలక పాత్ర పోషిస్తోంది. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర వార్త ఒకటి బయటకు వచ్చింది.
ఈ చిత్రంలో స్టార్ యాక్టర్ ఒకరు కామియో రోల్లో కనిపించబోతున్నాడన్న వార్త ఇండస్ట్రీ సర్కిల్లో హల్ చల్ చేస్తోంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రాబోతున్న ఈ చిత్రంలో మాలీవుడ్ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ కీలక పాత్రలో నటించనున్నాడని ఇన్సైడ్ టాక్. ప్రస్తుతానికి దీనికి సంబంధించి అధికారిక ప్రకటన ఏం రాకున్నా.. ఈ న్యూస్‌ను మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు అభిమానులు.
తాజా టాక్ ప్రకారం 45 ఏండ్ల వ్యక్తికి 20 ఏండ్ల యువతికి మధ్య రిలేషిన్ షిప్ నేపథ్యంలో సినిమా ఉండబోతుందట. ఏజ్ గ్యాప్ ఎక్కువగా ఉన్న వీరిద్దరి మధ్య ప్రేమ చిగురిస్తుందా..? ఇద్దరి మధ్య ట్రాక్ ఎలా ఉండబోతుందన్నది ఆసక్తికరంగా మారింది. సూర్య 46 చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ , ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగవంశి, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో సూర్య టాలీవుడ్ ఎంట్రీ ఇస్తుండటంతో అంచనాలు భారీగానే ఉన్నాయి.సూర్య మరోవైపు సుధాకొంగర డైరెక్షన్ల సూర్య 47లో నటిస్తున్నాడని తెలిసిందే.
Sree Vishnu | కామెడీ హీరో నుంచి కంటెంట్ స్టార్‌గా శ్రీవిష్ణు.. వరుస ప్రాజెక్టులతో ఫుల్ బిజీ షెడ్యూల్