OTT This Weekend | న్యూ ఇయర్ కానుకగా ఈ ఫస్ట్ వీకెండ్ ఓటీటీల్లో సినిమాల జాతర మొదలైంది. ఈ వారం థియేటర్లలో పెద్ద సినిమాలేవి లేకపోవడంతో నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, ఆహా, జీ5 వంటి ప్రధాన ప్లాట్‌ఫామ్స్‌లో తెలుగుతో పాటు ఇతర భాషలలో పలు చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అయితే ఏ ఏ సినిమాలు వచ్చాయి అనేది చూసుకుంటే.
నెట్‌ఫ్లిక్స్ (Netflix)
స్ట్రేంజర్ థింగ్స్ – సీజన్ 5 (ఫైనల్): తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో అందుబాటులో ఉంది.
ఎకో (Eko): మలయాళ మిస్టరీ థ్రిల్లర్. (తెలుగు వెర్షన్ జనవరి 7న రాబోతుంది)
హక్ (Haq): యామీ గౌతమ్, ఇమ్రాన్ హష్మీ నటించిన కోర్టు రూమ్ డ్రామా (హిందీ)
రన్ అవే (Run Away): సస్పెన్స్ వెబ్ సిరీస్ (తెలుగులోనూ అందుబాటులో ఉంది)
ల్యాండ్ ఆఫ్ సిన్ (Land of Sin): స్వీడిష్ క్రైమ్ సిరీస్
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video)
120 బహదూర్ (120 Bahadur): ఫర్హాన్ అక్తర్ వార్ డ్రామా.(ప్రస్తుతం రెంటల్‌లో ఉంది. జనవరి 16 నుంచి ఉచితంగా అందుబాటులో ఉండబోతుంది)
డ్రైవ్ (Drive): యాక్షన్ థ్రిల్లర్ (తెలుగు, తమిళం, హిందీ).
కుమ్కి 2 (Kumki 2): తమిళ చిత్రం
ఫుల్ మీల్స్ (Full Meals): కన్నడ కామెడీ ఎంటర్టైనర్.
ఈటీవీ విన్ (ETvWin)
మౌగ్లీ 2025 (Mowgli 2025): రోషన్ కనకాల నటించిన రొమాంటిక్ యాక్షన్ డ్రామా.
అస్మి (Asmi): సైకలాజికల్ థ్రిల్లర్.
జియో హాట్‌స్టార్ (JioHotstar)
LBW – లవ్ బియాండ్ వికెట్: క్రికెట్ నేపథ్యంలో సాగే తమిళ వెబ్ సిరీస్ (ఎపిసోడ్స్ 1-4).
ఆహా (Aha Video)
ఆజాదీ (Azadi): దేశభక్తి నేపథ్యంలో సాగే యాక్షన్ చిత్రం (తెలుగు వెర్షన్).
జీ5 (Zee5)
బ్యూటీ (Beauty): తెలుగు రొమాంటిక్ థ్రిల్లర్.
నన్ను మత్తు గుండా 2 (Nannu Matthu Gunda 2): కన్నడ మూవీ.