Sankranthi Holidays | హైదరాబాద్ : తెలంగాణలో సంక్రాంతి పండుగ హడావుడి మొదలైంది. ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలల్లో ఇవాళ ఘనంగా సంక్రాంతి వేడుకలను నిర్వహించారు. ఎందుకంటే రేపట్నుంచి స్కూళ్లకు సంక్రాంతి సెలవులు కాబట్టి. స్కూల్ విద్యార్థులు సంప్రదాయ దుస్తుల్లో ముస్తాబై పాఠశాలలకు వెళ్లారు.
రాష్ట్రంలోని అన్ని రకాల పాఠశాలలకు జనవరి 11 నుంచి 17 వరకు సంక్రాంతి సెలవులు ప్రకటించారు. 18వ తేదీన పాఠశాలలు తిరిగి తెరుచుకోనున్నాయి. ఇక జూనియర్ కాలేజీలకు జనవరి 11 నుంచి 16 వరకు సెలవులు ప్రకటించారు. 17న పునఃప్రారంభం కానున్నాయి.
సెలవు దినాల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా తరగతులు నిర్వహించకూడదని ఇంటర్మీడియట్ బోర్డు ప్రయివేటు కాలేజీల యాజమాన్యాలను హెచ్చరించింది. ఇంటర్ బోర్డు నిబంధనలు ఉల్లంఘించిన కాలేజీలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు.
ఇవి కూడా చదవండి..
Journalist Arrest | రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నందుకు జర్నలిస్ట్ అక్రమ అరెస్ట్
ASHA workers | ఉద్యమాన్ని ఉధృతం చేసిన ఆశా వర్కర్లు.. హామీలు నెరవేర్చాలని ఎమ్మెల్యేల ఇండ్ల ముట్టడి