ASHA workers | ఉద్యమాన్ని ఉధృతం చేసిన ఆశా వర్కర్లు.. హామీలు నెరవేర్చాలని ఎమ్మెల్యేల ఇండ్ల ముట్టడి
ASHA workers | రాష్ట్రంలో ఆశా వర్కర్లు(ASHA workers) ఉద్యమబాట పట్టారు. తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించకుంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
హైదరాబాద్ : రాష్ట్రంలో ఆశా వర్కర్లు(ASHA workers) ఉద్యమబాట పట్టారు. తెలంగాణ శాసనసభ సమావేశాల సందర్భంగా ఆశా కార్యకర్తల సమస్యలపై శాసనసభలో చర్చించాలని కోరుతూ.. ఈనెల జనవరి 10న ఎమ్మెల్యేల ఇండ్ల ముందు ధర్నాలు, చేపట్టాలని ఆశా యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది. అందులో భాగంగా ఖమ్మం జిల్లాలో పిలుపునిచ్చారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు క్యాంప్ కార్యాలయం ఆశా వర్కర్లు ధర్నా చేపట్టారు. ఆశాల పట్ల ప్రభుత్వ వైఖరి నశించాలంటూ నినాదాలు చేశారు. అలాగే వికారాబాద్ జిల్లా పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డిని ఇంటిని ముట్టడించారు.
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారు. దీంతో ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కనీస వేతనాలు, ఉద్యోగభద్రత కోసం పదిహేడేళ్లుగా పోరాడుతున్నా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదన్నారు. జాబ్‌చార్ట్ లేకుండా నిర్ణీత పనే కాకుండా సర్వేలకు, ఇతర పనులకు వినియోగిస్తూ శ్రమదోపిడీకి పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించకుంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

