గురువారం 28 మే 2020
Telangana - May 10, 2020 , 19:33:53

సీఎం సహాయనిధికి పారిశుధ్య కార్మికుల విరాళం

సీఎం సహాయనిధికి పారిశుధ్య కార్మికుల విరాళం

చిట్యాల: కరోనా నివారణకు తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న పోరాటానికి మద్దతుగా ఇప్పటి వరకు ఎంతోమంది  దాతలు తమవంతు ఆర్థిక సహాయం అందించగా నల్లగొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీ పారిశుధ్య సిబ్బంది మేము సైతం అంటూ ముందుకు వచ్చారు. మున్సిపాలిటీలో పనిచేసే సుమారు 30 మంది తలా కొంత వేసుకుని రూ.18 వేలు జమ చేశారు. వీటిని ముఖ్యమంత్రి సహాయ నిధి కోసం నకిరేకల్‌ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు ఆదివారం అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ కోమటిరెడ్డి చినవెంకట్‌రెడ్డి పాల్గొన్నారు. 


logo