గంటల్లోనే దిగి వచ్చిన మోదీ సర్కార్.. వడ్డీ రేట్ల కోత ఆదేశాలు వెనక్కి

న్యూఢిల్లీ: చిన్న మొత్తాల వడ్డీలో కోత విధిస్తున్నట్లు ప్రకటించిన కొన్ని గంటల్లోనే మోదీ సర్కార్ దిగి వచ్చింది. వడ్డీ రేట్ల కోత నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. పశ్చిమ బెంగాల్లో రెండో విడత ఎన్నికల నేపథ్యంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెంటనే రంగంలోకి దిగి ఈ విషయాన్ని ట్విటర్ ద్వారా ప్రకటించారు. ఈ ఆదేశాలను పొరపాటున జారీ చేశారని, వెంటనే వీటిని ఉపసంహరిస్తున్నట్లు ఆమె గురువారం ఉదయం ట్వీట్ చేశారు. చిన్న మొత్తాలు అంటే నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్స్ (ఎన్ఎస్సీ), ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్)లాంటి వాటిపై వడ్డీ రేట్లను తగ్గించడం దేశవ్యాప్తంగా కొన్ని కోట్ల మందిపై ప్రభావం చూపిస్తుంది. ఈ నిర్ణయం వెలువడిన వెంటనే మోదీ సర్కార్‌పై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి.
ఆ ప్రభావం ఎన్నికలపై ఎక్కడ పడుతుందో అన్న ఉద్దేశంతో వెంటనే వడ్డీ రేట్ల కోత నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడం గమనార్హం. 2020-21 చివరి త్రైమాసికంలో చిన్న మొత్తాలపై ఉన్న వడ్డీరేట్లే ఈ ఏడాది కూడా కొనసాగుతాయి. అంటే మార్చి 2021 నాటికి ఉన్న వడ్డీ రేట్లే ఉంటాయి. పొరపాటున ఇచ్చిన ఈ ఆర్డర్లను వెనక్కి తీసుకుంటున్నామని నిర్మలా సీతారామన్ ట్వీట్ చేశారు. ఈ చిన్న మొత్తాలపై వడ్డీ రేట్లను 1.1 శాతం మేర తగ్గిస్తున్నట్లు బుధవారం సాయంత్రం ప్రభుత్వం ప్రకటించింది. ఆ లెక్కన పీపీఎఫ్‌పై వడ్డీ రేటు 6.4 శాతానికి చేరింది. 1974 తర్వాత ఇంత తక్కువ వడ్డీ రేటు ఇదే కావడం గమనార్హం. గతేడాదే ఈ చిన్న మొత్తాలపై వడ్డీ రేట్లను మోదీ సర్కార్ 0.7 శాతం నుంచి 1.4 శాతం వరకూ తగ్గించింది.
Interest rates of small savings schemes of GoI shall continue to be at the rates which existed in the last quarter of 2020-2021, ie, rates that prevailed as of March 2021.
— Nirmala Sitharaman (@nsitharaman) April 1, 2021
Orders issued by oversight shall be withdrawn. @FinMinIndia @PIB_India
ఇవీ కూడా చదవండి..
తెలంగాణలో కొత్తగా 887 కరోనా కేసులు
కరోనా విలయం.. 500 మంది చిన్నారులకు పాజిటివ్
టీకా తీసుకున్న గంగవ్వ.. నొప్పికి గట్టిగా కేకలు
ఏపీలో లాక్డౌన్.. ఎక్కడంటే..?
ఈ నెలాఖరు వరకు సీఎంఆర్ సేకరణకు అవకాశం!
పాలు తాగించి.. పసిబిడ్డ పై పిడిగుద్దులు
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Woman Delivers Baby On Bus | బస్సులో ప్రయాణించిన గర్భిణీకి ప్రసవ వేదన.. ఆడ బిడ్డకు జన్మ
Polio Drops | పోలియో గురించి తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవే..
Oh Na Siddayya | శంషాబాద్‌లో ఘనంగా ‘ఓ నా సిద్ధయ్య’ పాట విడుదల.. హాజరైన సోనూసూద్!
AP Elections | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా
ముగిసిన సింగరేణి కంపెనీ స్థాయి చెస్, క్యారమ్స్ పోటీలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

