బిగ్ బాస్ సీజన్ 4 ఫేమ్ గంగవ్వ అతి తక్కువ సమయంలోనే అశేష ప్రేక్షకాదరణ పొందారు. మై విలేజ్ షో అనే యూట్యూబ్ కార్యక్రమంతో పాపులార్ కాగా, బిగ్ బాస్ షోతో ఆమెకు మరింత ఆదరణ దక్కింది. రీసెంట్గా వైల్డ్ డాగ్ సినిమా ప్రమోషన్లో భాగంగా నాగార్జునతో కలిసి ఫుల్ ఎంటర్టైన్ చేసింది గంగవ్వ. అయితే ప్రస్తుతం దేశమంతటా కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో గంగవ్వ కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు. మల్యాలలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంగళవారం ఆమెకు వ్యాక్సిన్ ఇచ్చారు.
వ్యాక్సిన్ ఇచ్చే సమయంలో నొప్పి భరించలేక గంగవ్వ చిన్న పిల్లల్లా కేకలు పెట్టింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. ప్రస్తుతం గంగవ్వ జ్వరంతో పాటు ఒళ్లు నొప్పులతో బాధపడుతున్నట్టు తెలుస్తుంది. వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత లక్షణాలు ఇలాగే ఉంటాయని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు అంటున్నారు.