చెన్నై: తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్‌కు సినిమాల్లో అత్యున్నత అవార్డుగా పరిగణించే దాదా సాహెల్ ఫాల్కే అవార్డు దక్కడంపై మరో సూపర్ స్టార్ కమల్ హాసన్ స్పందించాడు. ట్విటర్లో రజనీకి శుభాకాంక్షలు చెప్పాడు. సూపర్ స్టార్, నా ప్రియ మిత్రుడు రజనీకాంత్ ఈ అవార్డుకు 100 శాతం అర్హుడు. అతనికి ఈ అవార్డు దక్కడం చాలా సంతోషంగా ఉంది అని కమల్ తమిళంలో ట్వీట్ చేశాడు.
రజనీకాంత్, కమల్ హాసన్ కలిసి 16 సినిమాల్లో నటించడం విశేషం. ఈ ఇద్దరూ చివరిసారి 1985లో హిందీ మూవీ గిరఫ్తార్లో కలిసి నటించారు. మరోసారి ఇద్దరూ కలిసి నటించనున్నారని చాలా రోజులుగా వార్తలు వస్తున్నా.. ఇప్పటి వరకూ దీనిపై అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. 2019 ఏడాదికిగాను రజనీకి ఈ అత్యున్నత అవార్డు దక్కింది. గతేడాది కొవిడ్ కారణంగా దీనిని ప్రకటించలేదు. రజనీని ఈ అవార్డుకు ఎంపిక చేసిన జ్యూరీలో సింగర్లు ఆశా భోస్లే, శంకర్ మహదేవన్, నటులు మోహన్‌లాల్, బిశ్వజీత్, దర్శకుడు సుభాష్ ఘాయ్ ఉన్నారు.
ఇవీ కూడా చదవండి..
ఈ 9 నగరాల్లో 2023 ఫుట్‌బాల్ వరల్డ్‌కప్
గంటల్లోనే దిగి వచ్చిన మోదీ సర్కార్.. వడ్డీ రేట్ల కోత ఆదేశాలు వెనక్కి
చెన్నై సూపర్ కింగ్స్ ప్రాక్టీస్.. నెట్స్‌లో చెమటోడ్చిన ధోనీ, రైనా