నల్లగొండ : కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు రోడ్డెక్కుతున్నారు. నిత్యం ధర్నాలు, రాస్తారోకోలతో రాష్ట్రం అట్టుడుకుతున్నది. చిన్న పనికి కూడా రోడ్డు మీదకు వచ్చి ఆందోళన చేస్తే తప్పా పనులు కానీ దుస్థితి నెలకొంది. తాజాగా నల్లగొండ(Nallagonda Dist) జిల్లా ప్రభుత్వ కేంద్ర దవాఖానలో గత తొమ్మిది నెలలుగా పీఎఫ్ డబ్బులు చెల్లించడం లేదని, అలాగే మూడు నెలల నుంచి జీతాలు(Salaries) కూడా ఇవ్వడం లేదని ఆరోపిస్తూ శానిటేషన్ సిబ్బంది(Sanitation staff )ఆందోళన చేపట్టారు.
ఎన్నిసార్లు అడిగినా ఏజెన్సీ పేరు చెప్పి అధికారులు తప్పించుకుంటున్నార ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏజెన్సీ వారు ప్రభుత్వం నుంచి బిల్స్ రావట్లేదని అంటున్నారని, మధ్యలో తాము పస్తులు ఉండాల్సిన దుస్థితి వచ్చిందని శానిటేషన్ సిబ్బంది వాపోతున్నారు. నెలల తరబడి జీతం రాకపోవడంతో పిల్లల చదువులు, ఇల్లు గడవడం కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి సకాలంలో జీతాలు చెల్లించాలని కోరుతున్నారు.
Also Read..
PM Modi: అమెరికా టూర్లో జెలెన్స్కీతో ప్రధాని మోదీ భేటీ..
NIA Raids: తమిళనాడులోని 11 ప్రదేశాల్లో ఎన్ఐఏ సోదాలు