చెన్నై: తమిళనాడులోని 11 ప్రదేశాల్లో ఇవాళ ఎన్ఐఏ సోదాలు(NIA Raids) నిర్వహిస్తోంది. ఉగ్రవాదం కుట్ర కేసులో ఆ తనిఖీలు జరుగుతున్నాయి. ఈ విచారణకు సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడి కావాల్సి ఉన్నది. చెన్నై, పుదుకొట్టై, కన్యాకుమారిల్లో సోదాలు జరుగుతున్నాయి. హిజ్ ఉత్ తహిర్ కేసు విచారణలో భాగంగా ఈ తనిఖీలు నిర్వహిస్తున్నారు. నిషేధిత ఉగ్రవాద సంస్థలకు రిక్రూట్మెంట్ చేస్తున్న నేపథ్యంలో ఎన్ఐఏ ఈ తనిఖీలు చేపట్టింది.