PM Modi: అమెరికా టూర్లో జెలెన్స్కీతో ప్రధాని మోదీ భేటీ..
PM Modi: అమెరికా పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ.. న్యూయార్క్లో ఉక్రెయిన్ అధ్యక్షుడు వోల్డోమిర్ జెలెన్స్కీని కలిశారు. ఆ ఇద్దరూ ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొన్నారు.
న్యూఢిల్లీ: అమెరికా పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi).. న్యూయార్క్లో ఉక్రెయిన్ అధ్యక్షుడు వోల్డోమిర్ జెలెన్స్కీని కలిశారు. ఆ ఇద్దరూ ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొన్నారు. నెలల రోజుల వ్యవధిలోనే ఆ ఇద్దరూ రెండో సారి భేటీ అయ్యారు. ఆగస్టు 23వ తేదీన ఉక్రెయిన్లో మోదీ పర్యటించిన విషయం తెలిసిందే. రష్యాతో జరుగుతున్న యుద్ధాన్ని నిలిపివేసేందుకు తగిన చర్యలు తీసుకోనున్నట్లు ఆ సమయంలో మోదీ హామీ ఇచ్చారు. తాజాగా న్యూయార్క్లో జరుగుతున్న సమ్మిట్ ఆఫ్ ద ఫ్యూచర్ మీటింగ్లో కలిశారు.
ఇటీవల జరిగిన భేటీ గురించి ఇద్దరూ మాట్లాడుకున్నారు. ద్వైపాక్షిక సంబంధాలపై సంతోషం వ్యక్తం చేసుకున్నారు. ఉక్రెయిన్లో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల గురించి కూడా చర్చించుకున్నారు. దౌత్యం, చర్చల ద్వారా శాంతియుత పరిష్కారాన్ని ఆశిస్తున్నట్లు మరోసారి ఉక్రెయిన్ వివాదంపై ప్రధాని మోదీ తెలిపారు. సంక్షోభాన్ని పరిష్కరించేందుకు భారత్ సహాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు మోదీ చెప్పారు. గడిచిన మూడు నెలల్లో మోదీ, జెలెన్స్కీ కలుసుకోవడం ఇది మూడవ సారి.
Met President @ZelenskyyUa in New York. We are committed to implementing the outcomes of my visit to Ukraine last month to strengthen bilateral relations. Reiterated India’s support for early resolution of the conflict in Ukraine and restoration of peace and stability. pic.twitter.com/YRGelX1Gl5
— Narendra Modi (@narendramodi) September 23, 2024
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

