శుక్రవారం 27 నవంబర్ 2020
Telangana - Nov 17, 2020 , 22:23:35

రైతుల బాగుకోసమే రైతు చర్చా వేదికలు: వినోద్ కుమార్

రైతుల బాగుకోసమే రైతు చర్చా వేదికలు: వినోద్ కుమార్

రాజన్న సిరిసిల్ల జిల్లా: రైతుల బాగుకోసమే రైతు చర్చా వేదికలు ఏర్పాటు చేస్తున్న‌ట్టు రాష్ట్ర ప్ర‌ణాళికా సంఘం ఉపాధ్య‌క్షుడు తెలిపారు. బద్దెనపల్లి లో నిర్మించిన రైతు వేదికను పరిశీలించి సంతోషం వ్యక్తం చేశారు. అనంత‌రం ఇందిరమ్మ కాలనిలో పల్లె ప్రకృతి వనాన్ని ప‌రిశీలించారు. రైతు వేదికలు రైతుల సమస్యలు పరిష్కరించడానికి ఉపయోగపడుతాయని వెల్ల‌డించారు. పల్లె పార్కులు  ఎందుకు అన్నోళ్లకు ఇది చూపించాల‌న్నారు. గ్రామాల్లో పార్కుల ఆవశ్యకతను గురించి తెలిపిన వినోద్ కుమార్..పార్కులో మొక్క నాటారు.

జిల్లాల్లో స్మశానవాటికల నిర్మాణం,కంపోస్టు షెడ్, పల్లె పార్కుల నిర్మాణాల గూర్చి ఆపీసర్లను అడిగి తెలుసుకున్నారు. ప్రతి పల్లె పార్కులో ఓపెన్ జిమ్ ఏర్పాటు గూర్చి ప్రణాళికలు పంపాలని ప్రజాప్రతినిధులకు సూచించారు. ఆహ్లాదంతోపాటు వ్యయం కూడా అవసరమేనన్నారు. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.