TGSRTC | హైదరాబాద్ : తెలంగాణ ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో కార్మిక సంఘాల నేతలు ఆర్టీసీ యాజమాన్యానికి సమ్మె నోటీసులు ఇచ్చారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనం, రెండు పీఆర్సీల అమలు, సీసీఎస్, పీఎఫ్ డబ్బులు రూ. 2,700 కోట్ల చెల్లింపు తదితర డిమాండ్లను యాజమాన్యం ముందు ఉంచారు. డిమాండ్లు నెరవేర్చకుంటే ఫిబ్రవరి 9వ తేదీ నుంచి సమ్మెకు దిగుతామని నోటీసుల్లో పేర్కొన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 14 నెలలు గడుస్తున్నప్పటికీ.. ఆర్టీసీ కార్మికుల సమస్యలపై స్పందించడం లేదన్నారు. ఆర్టీసీ కార్మికులను నిర్లక్ష్యం చేస్తున్నారని సంఘాల నేతలు మండిపడ్డారు. ఇలానే నిర్లక్ష్యం వహిస్తే ప్రభుత్వానికి తమ తడాఖా ఏంటో చూపిస్తామని హెచ్చరించారు. ఐదేండ్ల తర్వాత సమ్మె చేయడం ఇదే తొలిసారి అని గుర్తు చేశారు. ఆర్టీసీని ప్రయివేటుపరం చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఒక వేళ అదే కనుక జరిగితే.. వేలాది మంది ఆర్టీసీ కార్మికులు తమ ఉద్యోగాలను కోల్పోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో రేవంత్ రెడ్డి సర్కార్ నిర్లక్ష్యం వహిస్తుందని మండిపడ్డారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామన్న ప్రతిపాదనను మరిచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్ద ఎత్తున కార్మిక సంఘాల నేతలు బస్ భవన్ వద్దకు చేరుకోవడంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీగా మోహరించారు.
తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సైరన్
బస్ భవన్ వద్ద భారీగా చేరుకున్న ఆర్టీసీ కార్మికులు, యూనియన్ నేతలు
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, పెండింగ్ సమస్యల పరిష్కారం చేయాలని సమ్మెకు సిద్ధమవుతున్న ఆర్టీసీ కార్మిక సంఘాలు
21 డిమాండ్లతో సమ్మె నోటీసులు యాజమాన్యానికి అందించిన ఆర్టీసీ… https://t.co/rAouPBkjTi pic.twitter.com/iLQYcqT73w
— Telugu Scribe (@TeluguScribe) January 27, 2025
ఇవి కూడా చదవండి..
Bandi Sanjay | పద్మ అవార్డులు స్థాయి ఉన్నవాళ్లకే ఇస్తాం.. గద్దర్‌కు ఎలా ఇస్తాం : బండి సంజయ్
KTR | ఈ సిపాయిలు తీసుకొచ్చిన పెట్టుబడులను చూసి.. మనకు అజీర్తి అయిందట : కేటీఆర్
KTR | ఆ సినిమాలోని కోట శ్రీనివాస్ రావు క్యారెక్టర్ మాదిరి.. రేవంత్ రెడ్డి పాలన : కేటీఆర్