Food Poisoing : హైదరాబాద్ వనస్థలిపురంలో పండుగ పూట విషాదం నెలకొంది. ఫుడ్ పాయిజనింగ్ (Food Poisioning) ఒకరి ప్రాణాలను బలిగొన్నది. బోనాల పండుగ (Bonalu Festival) రోజైన సోమవారం ఆర్టీసీ ఉద్యోగి శ్రీనివాస్ (Sreenivas) కుటుంబ సభ్యులు మటన్ తెచ్చుకున్నారు. వండిన మటన్‌ను మరుసటి రోజుకని ఫ్రిజ్‌లో పెట్టారు. ఫ్రిజ్‌లో నిల్వ చేసిన మటన్‌ను మంగళవార శ్రీనివాస్, కుటుంబ సభ్యులు తిన్నారు.
మటన్ కలుషితం కావడం వల్ల కాబోలు కాసేపటికే వాళ్లకు ఫుడ్ పాయిజనింగ్ అయింది. తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దాంతో వీళ్లను ఆస్పత్రిలో తరలించారు. అయితే.. శ్రీనివాస్ మృతి చెందగా.. ఏడుగురు కుటుంబ సభ్యుల పరిస్థితి విషమంగా ఉంది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.