చందంపేట (నేరెడుగొమ్ము), జూలై 22 : నేరెడుగొమ్ము మండల కేంద్రంతో పాటు మండలంలోని పెద్దమునిగల్ గ్రామం, డిండి మండల కేంద్రంలో, చందంపేట మండలంలోని హంక్యతండా నుంచి కోరుట్ల వరకు సెంట్రల్ లైటింగ్ పనులు, రోడ్డు వెడల్పు పనులు చక చక సాగుతున్నాయి. ఎస్డిఎఫ్ సబ్ ప్లాన్ నిధులు రూ.7 కోట్లతో ఏర్పాటు చేస్తున్న సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ పనులు దసరా నాటికి పూర్తి చేసి అందుబాటులోకి తీసుకొచ్చే దిశగా పనులు చేస్తున్నారు. పెద్దమునిగల్ గ్రామంలో ప్రతి ఏడాది దసరా సందర్భంగా నిర్వహించే తుల్జా భవాని అమ్మవారి జాతరలో పాల్గొనేందుకు ఇక్కడికి భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. ఈ మేరకు పనులు దసరా లోగా పూర్తి చేసి నేరెడుగొమ్ము, పెద్దమునిగల్ల సెంట్రల్ లైటింగ్ అందుబాటులోకి వస్తే ఇక్కడ రవాణా పరంగా, ప్రజలకు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.