ఎల్లారెడ్డిపేట, ఫిబ్రవరి 17: ఆర్టీసీ బస్సు(RTC bus )గాడి తప్పుతున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం ఉచిత బస్సు స్కీంతో ప్రయాణికులు అష్టకష్టాలు పడుతున్నారు. సరిపడా బస్సులు లేక, ఉన్న బస్సుల్లో ఓవర్ లోడ్‌తో ప్రయాణం నరకమవుతున్నది. తాజాగా సోమవారం రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం వన్‌పల్లి నుంచి సిరిసిల్లకు వెలుతున్న బస్సులో 110 మంది ప్రయాణికులు ఎక్కడంతో బస్సు మొరాయించింది.
ఓవర్‌లోడ్ కారణంగా అల్మాస్‌పూర్‌లోని మల్లికార్జున స్వామి ఆలయం వద్ద నిలిచిపోయింది. డ్రైవర్, కండక్టర్ ఎంత చెప్పినా ఎవరు కూడా బస్సు దిగేందుకు ఒప్పుకోలేదు. దీంతో గమ్యస్థానాలకు వెళ్లాల్సిన ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కాగా, పరిమితికి మించి ఎక్కించుకోవడం సరికాదని, ఏదైనా ప్రమాదం జరిగితే బాధ్యత ఎవరిదని ప్రయాణికులు ప్రశ్నించారు. అదనపు బస్సులు నడపాలని ఆర్టీసీ యాజమాన్యాన్ని కోరారు.
ఇవి కూడా చదవండి..
Mahakumbh | మహా కుంభమేళాలో మళ్లీ అగ్నిప్రమాదం.. నెల రోజులలో ఏడోసారి
Chhaava: విక్కీ కౌశల్ ఛావా కొత్త రికార్డు.. 3 రోజుల్లో 164 కోట్లు వసూల్