Chhaava: విక్కీ కౌశల్ ఛావా కొత్త రికార్డు.. 3 రోజుల్లో 164 కోట్లు వసూల్
Chhaava: వీకెండ్లో 164 కోట్లు వసూల్ చేసింది ఛావా. ఈ బాలీవుడ్ ఫిల్మ్‌లో విక్కీ కౌశల్ ప్రధాన పాత్ర పోషించాడు. స్కైఫోర్స్ బాక్సాఫీసు రికార్డును ఛావా బ్రేక్ చేసింది.
న్యూఢిల్లీ: విక్కీ కౌశల్ నటించిన ఛావా(Chhaava).. బాక్సాఫీసు రికార్డులు బద్దలు కొడుతోంది. వీకెండ్లో ఈ మూవీ .. 164.75 కోట్లు వసూల్ చేసింది. ఈ యేడాది మూడు రోజుల్లో అంత భారీ అమౌంట్ జనరేట్ చేసిన ఫస్ట్ హిందీ ఫిల్మ్‌గా ఛావా నిలిచింది. ఈ ఫిల్మ్‌లో రష్మిక మందానా కూడా నటించింది. గత నెలలో రిలీజైన తొలి మూడు రోజుల్లోనే అక్షయ్ కుమార్ నటించిన స్కైఫోర్స్ 140 కోట్లు వసూల్ చేసింది. అయితే స్కైఫోర్స్ కలెక్షన్లను ఛావా దాటేసింది.
సాక్నిల్క్ వెబ్సైట్ ప్రకారం.. ఛావాకు 164.75 కోట్లు వచ్చాయి. ఇండియాలో ఈ మూవీకి 139 కోట్లు వసూల్ కాగా, విదేశాల్లో ఈ చిత్రం మరో 25 కోట్లు ఆర్జించింది. మిమి ఫేమ్ లక్ష్మణ్ ఉటేకర్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేశాడు. ఫిబ్రవరి 14వ తేదీన ఛావా చిత్రం రిలీజైంది. మాడాక్ ఫిల్మ్స్‌కు చెందిన దినేశ్ విజన్ దీన్ని నిర్మించారు.
మరాఠా యోధుడు ఛత్రపతి సంబాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా ఈ ఫిల్మ్‌ను రూపొందించారు. విక్కీ కౌశల్ దీంట్లో ప్రధానపాత్ర పోషించారు. ఆయన భార్య యెసుబాయ్ పాత్రను రష్మిక పోషించింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

