Komatireddy Rajagopal Reddy | ఇందిరమ్మ ఇల్లుకు రూ.5 లక్షలు సరిపోవు.. కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి
Komatireddy Rajagopal Reddy | రాష్ట్రవ్యాప్తంగా నిర్మాణ కార్మికుల సమస్య ఏర్పడ్డది. మేస్త్రీలు, లేబర్ చార్జీలకే రూ.3-4 లక్షలు తీసుకుంటున్నారు.. అంతకంటే తక్కువ ఎవరూ అడుగుతలేరు.. కనస్ట్రక్చర్ మెటీరియల్ ధర కూడా పెరిగిపోయిందన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి.
Komatireddy Rajagopal Reddy | పేదలకు ఇస్తున్న ఇందిరమ్మ ఇండ్లకు కాంగ్రెస్ సర్కార్ ఇస్తున్న రూ.5 లక్షలు సరిపోవని ఆ పార్టీ ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి స్వయంగా స్పష్టం చేశారు. శాసనసభలో ఈ విషయమై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. ఇల్లు నిర్మాణ ఖర్చు రూ.10 లక్షల కంటే తక్కువ ఎక్కడా అయితలేదు.. ఇప్పుడు నిర్మాణ వ్యయం చాలా పెరిగింది.. రాష్ట్రవ్యాప్తంగా నిర్మాణ కార్మికుల సమస్య ఏర్పడ్డది. తక్కువలో తక్కువ ఎక్కడైనా సరే మేస్త్రీలు, లేబర్ చార్జీలకే రూ.3-4 లక్షలు తీసుకుంటున్నారు.. అంతకంటే తక్కువ ఎవరూ అడుగుతలేరు.. మనం ఇన్ని చదరపు అడుగుల్లో కట్టాలని రూల్స్ పెట్టినం.. కానీ కనస్ట్రక్చర్ మెటీరియల్ ధర కూడా పెరిగిపోయిందన్నారు.
సడెన్‌గా ఇల్లు కట్టేసరికి ట్రాక్టర్లో ఇసుక తెచ్చుకోవాలన్నా, మెటల్ ధర, లేబర్ ఛార్జీలు పెరిగిపోయాయి. ఈ క్రమంలో రూ.5-7 లక్షల్లో అయ్యేది కాస్తా.. రూ.10-15 లక్షల మధ్యన ఖర్చవుతుంది. ఇది ఎక్కడ చెక్ చేసినా రూ.10 లక్షల కంటే తక్కువ ఎక్కడా అయితలేదన్నారు.
చాలా మంది ఇల్లు వచ్చిందని సంతోషంగా ఉన్నారు. కొందరేమో డబ్బుల్లేక స్టార్ట్ చేసుకోలేదు.. బేస్మెంట్ కూడా మొదలుపెట్టలేదు. ఇల్లొచ్చింది కదా మీ ఊరిలో 27 ఇండ్లు వస్తే ఏడుగురు స్టార్ట్ చేయలేదంటే.. మా దగ్గర మొదలుపెట్టేందుకు డబ్బుల్లేవ్ సార్ అంటున్నరు. కొందరేమో డబ్బులు సరిపోక మొదలుపెట్టినం సార్ ఎటుకాకుండా అని చెప్పి.. భార్య బంగారం తాకట్టు పెట్టో,, అప్పు తీసుకొచ్చి మేం ఇల్లు కట్టుకున్నం కానీ డబ్బులు సరిపోకపోయేసరికి మాకు అప్పులైనయ్ అంటున్నారని.. కాబట్టి ఇందిరమ్మ ఇళ్ల బడ్జెట్‌ను పెంచాలని కోరుతున్నా అని కోమటిరెడ్డి పేర్కొన్నారు.
ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడానికి ఇచ్చే రూ.5 లక్షలు సరిపోవట్లేదు
మేస్త్రిలే రూ.3-4 లక్షలు తీసుకుంటున్నారు.. మెటీరియల్ కాస్ట్ కూడా పెరిగిపోయింది
ఇప్పుడు ఇల్లు కట్టాలంటే రూ.10-15 లక్షలు అవసరం పడుతున్నాయి
చాలా మంది ఇల్లు వచ్చినా డబ్బులు లేక మొదలు పెట్టలేదు, కొంతమంది డబ్బులు సరిపోక… pic.twitter.com/9yqWkoVzjj
— Telugu Scribe (@TeluguScribe) September 10, 2026
Read Also :
KCR | కేసీఆర్ ఎందుకు రాజీనామా చేయాలి.. రేవంత్ రెడ్డినే రాజీనామా చేయాలి.. కాంగ్రెస్ వ్యూహం రివర్స్
Nitin Gadkari | హైవే పనులు ఆలస్యంపై సిగ్గుపడుతున్నా.. ప్రారంభోత్సవానికి నేను రాను: నితిన్ గడ్కరీ
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hanumakonda | అసమాన ప్రతిభతో ‘ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్’లో చోటు.. చిన్నారిని అభినందించిన స్కూల్ యాజమాన్యం..!
IND vs WI | చితక్కొట్టిన శాంసన్, తిలక్, అయ్యర్.. రాంచీలో విండీస్ ముందు కొండంత లక్ష్యం..!
Pregnancy | గర్భం కోసం ప్రయత్నిస్తున్న మహిళలు.. ఎప్పుడు ఫెర్టిలిటీ నిపుణులని కలవాలి..?
Students Appeal | ‘మాబడిలో హిందీ టీచర్ లేరు.. కలెక్టర్‌కు చెప్పి మూడు నెలలనైనా నియమించలే’..!
Newlywed Couple’s Bodies | కాళ్లకు గొలుసులతో.. నదిలో నూతన దంపతుల మృతదేహాలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

