వైరా టౌన్, సెప్టెంబర్ 10 : వైరాలోని స్థానిక మున్సిపల్ కార్యాలయం ముందు గల చాకలి ఐలమ్మ విగ్రహానికి ఆమె 41వ వర్ధంతి సందర్భంగా రజక సంఘం నాయకులు ఏదునూరి శీను ఆధ్వర్యంలోపూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నైజాం ప్రభుత్వంలో రజాకారులతో పోరాటం చేసి నైజాం నిరంకుశత్వాన్ని పారదోలేందుకు తన వంతు పోరాటం చేశారని పేర్కొంటూ ఐలమ్మ సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో రేవల్ల కోటేశ్వరరావు, సందుల దుర్గయ్య, సంగెపు వెంకన్న, గరిడేపల్లి కిశోర్, ఏదునూరు శ్రీను, రాము, రేమల రాము, బాసటి రామారావు, రేగళ్ల వీరభద్రం, రేగళ్ల శ్రీను, గరిడేపల్లి నారాయణ, నవీన్, తాళ్లూరి నరేశ్, పాల్గొన్నారు.