RTC bus : హైదరాబాద్ శివార్లలోని అబ్దుల్లాపూర్మెట్లో ఘోర ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు అదుపుతప్పి పెట్రోల్ పంపులోకి దూసుకెళ్లింది. ఎదురుగా వచ్చిన బైకును తప్పించబోయి డ్రైవర్ బస్సును పెట్రోల్ పంపులోకి తీసుకెళ్లాడు. అబ్దుల్లాపూర్ మెట్ సమీపంలోని బాటసింగారం దగ్గర ఈ ఘటన జరిగింది.
పెట్రోల్ పంపులోకి దూసుకెళ్లిన బస్సు అక్కడ పెట్రోల్ పోసుకుంటున్న కారును ఢీకొట్టింది. కారులో పెట్రోల్ నింపుతున్న వ్యక్తి అక్కడి నుంచి వెంటనే తప్పుకోవడంతో ప్రాణాపాయం తప్పుతుంది. ఈ ఘటనలో కారు, ఆటో దెబ్బతిన్నాయి. బస్సు అదుపుతప్పి పెట్రోల్ పంపులోకి దూసుకెళ్లిన ఘటనకు సంబంధించిన దృశ్యాలను కింది వీడియోలో చూడవచ్చు.
సీసీటీవీ ఫుటేజ్
హైదరాబాద్ శివారులో ఆర్టీసీ బస్సు బీభత్సం
అబ్దుల్లాపూర్మెట్ బాటసింగారం వద్ద బైక్ను తప్పించబోయి అదుపుతప్పి పెట్రోల్ బంక్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు
ఈ ప్రమాదంలో పెట్రోల్ బంక్లో ఉన్న కారు, ఆటో, డీజిల్ పంపును ఢీకొట్టిన బస్సు pic.twitter.com/hc8i2igQJ5
— Telugu Scribe (@TeluguScribe) September 10, 2026