Liquor sales in Telangana | హైదరాబాద్ : దసరా పండుగ నేపథ్యంలో తెలంగాణలో జోరుగా మద్యం అమ్మకాలు కొనసాగాయి. రాష్ట్రంలో దసరా మద్యం అమ్మకాలు రూ. 1100 కోట్లు దాటాయి. ఈ నెల 11న ఒక్కరోజే రూ.200.44 కోట్లు, 10న రూ.152 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. అక్టోబర్ 1 నుంచి 10 వరకు రూ.852.40 కోట్ల విలువైన మందు అమ్ముడైనట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు. బార్లు, మద్యం దుకాణాలతో పాటుగా పబ్ లలోనూ అమ్మకాలు పెరిగాయి. దీంతో సర్కార్ ఖజానాకు.. మద్యం భారీగా ఆదాయం తెచ్చి పెట్టింది. మద్యం అమ్మకాల్లో ఎప్పటిలాగే హైదరాబాద్ అగ్రస్థానంలో నిలిచింది.
రాష్ట్రంలో 2 వేల 260 మద్యం దుకాణాలు, 1,171బార్లు, రెస్టారెంట్లు ఉన్నాయి. వీటితో పాటుగా పబ్బుల్లోనూ మద్యం అమ్మకాలు కొనసాగుతున్నాయి. దసరాకు ముందు నుంచే మొదలైన మద్యం కిక్కు శని, ఆదివారాల్లో పీక్స్‌కు చేరింది. సెప్టెంబర్ 30 వరకు 2 వేల 838 కోట్ల అమ్మకాలు జరగ్గా… అక్టోబర్ నెల ప్రారంభం నుంచి 11వ తేదీ వరకు రూ 1,100 కోట్ల మేర విలువైన 10 లక్షల 44వేల కేసుల మద్యం అమ్మకాలు జరిగినట్లు ఆబ్కారీ అధికారులు చెబుతున్నారు. 10 రోజులవ్యవధిలోనే 17 లక్షల 59 వేల బీర్లు అమ్ముడుపోయాయట. మద్యం అమ్మకాల్లో ఉమ్మడి రంగారెడ్డి టాప్‌లో ఉండగా ఉమ్మడి కరీంనగర్, నల్లగొండ, వరంగల్ జిల్లాలు తర్వాతి మూడు స్థానాల్లో ఉన్నాయి.
ఇవి కూడా చదవండి..
TGPSC | నేటి నుంచి గ్రూప్-1 హాల్‌టికెట్లు.. మరికాసేపట్లో విడుదల చేయనున్న టీజీపీఎస్సీ
CPI Narayana | సాయిబాబాది సహజ మరణం కాదు, అది ముమ్మాటికి ప్రభుత్వ హత్యే : సీపీఐ నారాయణ
Attack on head constable | గీసుకొండలో హెడ్ కానిస్టేబుల్‌పై దాడి.. కొండా వర్గీయుల పనేనా?